సినీ పరిశ్రమలో మరో విషాదం,అనారోగ్యంతో ప్రముఖ నటుడు మృతి.
వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న డాన్ ముర్రే అనారోగ్యంతో మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక డాన్ ముర్రే మరణ వార్తతో హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అంతే కాదు ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే హాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ నటుడు బస్ స్టాప్, నాట్స్ ల్యాండింగ్ చిత్రాల ఫేమ్ డాన్ ముర్రే (94) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. వయోభారంతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1929, జులై 31 న లాస్ ఏంజెల్స్ లో డాన్ ముర్రే జన్మించారు. డొనాల్డ్ పాట్రిక్ ముర్రే 1951 లో తెరకెక్కించిన ‘ది రోజ్ టటూ’ మూవీతో బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
1956 డాన్ ముర్రే నటించిన చిత్రం ‘బస్ స్టాప్’లో కౌబాయ్‌గా నటించినందుకు ఆస్కార్ నామినేషన్ పొందాడు. ఒకప్పటి హాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ మార్లిన్ మన్రో ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. ది స్కిన్ ఆఫ్ అవర్ టీత్, ఎ హాట్‌ఫుల్ ఆఫ్ రెయిన్, షేక్ హ్యాండ్స్ విత్ ది డెవిల్, ది హూడ్లం ప్రీస్ట్ తో పాటు దాదాపు 35 చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాకుండా రచన, దర్శకత్వం, నిర్మాణ రంగాల్లో కూడా తనదైన ముద్ర వేశారు.
డాన్ ముర్రే మరణ వార్త తో హాలీవుడ్ ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికీ హాలీవుడ్ లో అభిమానలు ఆయనను కౌబాయ్ గానే చూస్తుంటారు. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.