Health

కుక్క కరిస్తే వెంటనే ఇలా చేయండి, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం.

కుక్క కాటుకు గురైన వారిలో కొందరు సరైన చికిత్స పొందరు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది ప్రాణాలకే ప్రమాదం. కుక్క పళ్లు శరీరంలోకి చొచ్చుకుపోయినప్పుడు దాని చొంగ ద్వారా రేబిస్ వైరస్ సోకే ప్రమాదం ఉంది. అయితే ఎన్నో ఏండ్ల కిందటి నుంచి కుక్కలను పెంచుకుంటూ వస్తున్నారు. కాపలాగా.. వేటకు అంటూ కుక్కలను మన తాతలు, ముత్తాతలు మచ్చిక చేసుకుని పెంచుకునేవారు. కుక్కలు ఎంత నమ్మదగినవైనా.. ఏదో ఒక సందర్భంలో.. కరుస్తాయి.

పెంపుడు కుక్కలే కాదు.. వీధి కుక్కలు సైతం ఒక్కోసారి తిక్క తిక్కగా చేసి.. కరుస్తూ ఉంటాయి. కానీ ఈ కుక్క కాటు అస్సలు మంచిది కాదు. దీనికాటు వల్ల రేబిస్ వ్యాధి బారిన పడతారు. మరి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పదండి. కుక్క కరిచినప్పుడు మనకు వ్యాపించే వైరసే రేబిస్. ఈ వైరస్ మన మెదడును దెబ్బతీస్తుంది. అంటే ఈ వైరస్ నరాలు చచ్చుబడిపోయేలా చేస్తుంది.

అంతేకాదు సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ప్రాణాలు కూడా కోల్పోతారు. మనిషులకే కాదు.. ఈ రేబిస్ జంతువులకు కూడా సోకుతుంది. అందుకే కుక్కలను పెంచుకునే వారు వాటికి ప్రతి ఏడాది ఇంజెక్షన్లు ఇప్పించండి. కుక్క కరిస్తే వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పదండి. కుక్క కరిచిన వెంటనే జబ్బుతో గాయాన్ని సున్నితంగా కడగండి. అంటే గాయంపై 15 నిమిషాలైనా నీటిని పోస్తూనే ఉండాలి.

కుక్క కరిచిందని గాయాన్ని గుడ్డతో కానీ.. ఏదైనా బ్యాండేజ్ కానీ వేయకండి. రక్తం లేదా నీరైనా.. అలాగే కరానివ్వండి. గాయాన్ని అలా వదిలేస్తేనే వైరస్ బయటకు వెళుతుంది. ఆ తర్వాత గాయంపై యాంటీ బయోటిక్ క్రీమ్ ను రాయండి. ఆ వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. డాక్టర్ సూచనలను సలహాలను తప్పకుండా పాటించండి. జ్వరం రావడం, గాయం దురద పెట్టడం వంటి సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ కు తెలియజేయండి. మీ ఇంట్లో కుక్క ఉంటే.. దానికి వ్యాక్సిన్ ను తప్పకుండా వేయించండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker