దివ్య భారతి మరణానికి కారణం అదే, సంచలన నిజాన్ని బయటపెట్టిన సన్నిహితురాలు.
ఏప్రిల్ 5, 1993న, ఆమె పుట్టిన రోజు తర్వాత, దివ్య భారతి ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్తు నుండి పడి మరణించింది. ఈ మరణం వెనుక ఆమె భర్త సాజిద్ నదియావాలా హస్తం ఉందని ఆరోపించారు. అయితే ఇప్పుడు దివ్య మృతిది హత్య కాదని, ప్రమాదవశాత్తు జరిగిన మరణమని ప్రముఖ హాస్యనటుడు, దివ్య భారతి సన్నిహితుడు గుడ్డి మారుతి పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గుడ్డి మారుతి మాట్లాడుతూ.. “‘దివ్య మంచి అమ్మాయి. కానీ ఎప్పుడూ రెస్ట్ లెస్ గా ఉండేది.
తన జీవితంలోని ప్రతి రోజూ ఈరోజే చివరి రోజు అన్నట్టుగా గడిపేది.. అప్పుడు ‘షోలా ఔర్ షబ్నం’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 5న దివ్య మరణించింది, ఏప్రిల్ 4న నా పుట్టినరోజు. ఆరోజు మేము పార్టీ చేసుకున్నాము. గోవింద, దివ్య , సాజిద్ మరికొందరు కూడా పార్టీలో పాల్గొన్నారు. దివ్య పార్టీలో అందరితో మాట్లాడుతున్నప్పటికీ తాను ఎందుకో బాధపడుతుందని భావించాను. ఉదయాన్నే ఔట్ డోర్ షూటింగ్ కి వెళ్లాలనుకుంది. కానీ దివ్యకు వెళ్లడం ఇష్టం లేదు.
దివ్య ఐదో అంతస్తులో ఉండేవారు. ఆ రాత్రి నేను ఐస్ క్రీం తీసుకోవడానికి కిందకి వెళ్లాను. అప్పుడు నన్ను పై నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించింది. వెళ్లి చూసే సరికి దివ్య బాల్కనీలో కూర్చుని కనిపించింది. ఇక్కడ కూర్చోవడం సురక్షితం కాదని చెప్పాను. కానీ నాకు ఎత్తైన స్థలాలు అంటే భయం లేదని.. తనకు ఏం కాదని నాతో చెప్పింది. సాజిద్ కారు వచ్చిందో లేదో చేసేందుకు దివ్య కిందకు వంగి చూసింది.. అప్పుడు అనుకోకుండా ఆమె కిందపడి చనిపోయింది.
డిజైనర్ నీతా లుల్లా కూడా ఆ ఘటన చూసింది. దివ్య మరణం తర్వాత ఆమె తల్లి పూర్తిగా కృంగిపోయింది. సాజిద్ కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఆ ఘటన జరిగినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గుడ్డి మారుతి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.