News

విడాకులు తీసుకున్న ప్రతి పురుషుడు ఎక్కువగా చెప్తున్నా కారణాలు ఇవే.

పెళ్ళి తరువాత భార్యాభర్తలు అనివార్య కారణాల వలన విడిపోవాలని నిర్ణయించుకోవడాన్ని విడాకులు గా పిలుస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాలలో విడాకులు ఎక్కువగా జరుగుచున్నవి. విడాకుల వల్ల విడిపోయిన కుటుంబాల్లోని పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోంది.వివాహాల సమయంలోనే ముందస్తు విడాకుల పిటిషన్లు దాఖలవుతున్నాయి.భాగస్వామికి కుష్టు, మానసిక అనారోగ్యం లాంటి వ్యాధులున్నాయనే కారణాలపై విడాకులు ఇవ్వవచ్చు. వీటిని కొన్ని జంటలు దుర్వినియోగం చేస్తున్నాయి.

అయితే ఈ రోజుల్లో చిన్నపాటి తగాదాలు, మనస్పర్థలు వస్తే వాటిని పరిష్కరించుకునే మానసిక సామర్థ్యం, విచక్షణ జ్ఞానం లోపించి విడాకులు తీసుకోవడానికి చాలా జంటలు కోర్టుల వెంబడి పరుగులు పెడుతున్నారు. జీవిత గమనంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధ తలెత్తినప్పుడు సమస్యను సున్నితంగా పరిష్కరించుకునే దిశగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తవు.

విడాకులు తీసుకునే పురుషులపై అధ్యయనం నిర్వహించగా కొందరు పురుషులు తాము విడాకులు తీసుకోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది పురుషులు విడాకులు తీసుకోవడానికి చెప్పిన కారణం తమ భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుండడం. భార్య లేదా భర్త క్షణికావేశంలో చేసే తప్పులే వారి జీవితాలకు శాపంగా మారుతుందనేది గుర్తుంచుకోవాలి. భర్తలతో భార్యలు చీటికిమాటికి గొడవ పెట్టుకోవడం, ఫోన్ కాల్స్ ను చెక్ చేయడం,

ఎక్కడికి వెళ్ళినా అనుమానంతో ప్రశ్నలు వర్షం కురిపించడం, గట్టిగా అరవడం, ఏడవడం వంటి కారణాలతో తమ భార్యలు పెట్టే బాధలను భరించలేక ప్రతిరోజు తీవ్ర మానసిక ఒత్తిడి అనుభవించలేక కుటుంబ బంధాల నుంచి ముక్తి పొందడానికి విడాకులు తీసుకుంటున్నామని చాలామంది చెబుతున్నారు. విడాకులు తీసుకోవడానికి మద్యం, ధూమపానం, డ్రగ్స్ కూడా కారణం అవుతున్నాయి.

కొందరు పురుషులు మద్యపానం లాంటి చెడు అలవాట్లకు బానిసగా మారి తమ స్వేచ్ఛకు కుటుంబ బాధ్యతలు అడ్డువస్తున్నాయన్న భావనతో చాలామంది విడాకులు తీసుకుంటున్నామని చెప్తున్నారు. భార్యలు తమ తల్లిదండ్రులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి భర్త సంపాదన అంతా వారికే దోచిపెట్టడం లాంటి కారణాలు లేదా భర్త తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం చిత్రహింసలకు గురి చేయడం, భర్త తరపు బంధువులతో హేళనగా మాట్లాడడం వంటి కారణాలతో ఎక్కువమంది పురుషులు విడాకులు తీసుకుంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker