News

లైంగిక సమస్య కారణంగా విడాకులు కోరుకుంటున్న స్టార్ హీరో కొడుకు..?

యాదృచ్చికంగా జరిగిందో లేక కావాలని చేసారో తెలియదు కానీ ఈ ఇద్దరు హీరోల పరిచయం తెలుగు దర్శకుల చేతిలోనే జరగడం విశేషం. శివ రాజ్ కుమార్ ని తెలుగు లెజెండరీ దర్శకుడు అయినా సింగీతం శ్రీనివాస రావు చేతుల మీదుగా పరిచయం చేయించాడు. ఇక పునీత్ రాజ్ కుమార్ ని పూరి జగన్నాథ్ కన్నడ ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.ఈ ఇద్దరు తమ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు. అయితే జైలర్ లో నరసింహగా తెలుగు ఆడియెన్స్‌కు శివ రాజ్ కుమార్ ఏ రేంజ్‌లో కనెక్ట్ అయ్యాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బయట తను కనిపిస్తే చాలు జైలర్ నరసింహా అంటూ పిలిచేస్తున్నారు.

అంతటి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడేకంగా రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మేయిన్ విలన్‌గా చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఇక ఆయన తమ్ముడు పునీత్ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. తెలుగులో సినిమాలు చేయకపోయినా ఆయనకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అంతేకాకుండా ఆయన చనిపోయినప్పుడు కూడా టాలీవుడ్ ఆడియెన్స్ బాధ పడ్డారు. అంతలా ఆ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యారు. కాగా అలాంటి ఫ్యామిలీ ఇప్పుడు కన్నడనాట తీవ్రంగా ట్రెండింగ్ అవుతుంది. శివ రాజ్‌కుమార్ తమ్మడు కొడుకు యువ రాజ్ కుమార్ విడాకులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

యువ రాజ్‌కుమార్ రీసెంట్ గా యువ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. హోంబలే బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా హీరో యువకు తొలి సినిమానే సూపర్ హిట్టుగా నిలిచింది. ఇలా ప్రొఫెషన్ లైఫ్ లో సక్సెస్ అయిన యువ.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఒడిదుడకులు ఎదుర్కొంటున్నాడు. యువ రాజ్ కుమార్ నాలుగేళ్ల కిందట శ్రీదేవి భైరప్పను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నిజానికి వీళ్ల ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. అయితే పునీత్ రాజ్‌కుమార్ అందరినీ ఒప్పించి దగ్గరుండి పెళ్లి చేశాడు.

కాగా ఇప్పుడు వీరిద్దరు విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కారు. శ్రీదేవి.. తన భర్త యువకు అక్రమ సంబంధం ఉందని సంచలన ఆరోపణలు చేసింది. దాంతో వీళ్ల కేసు కన్నడనాట హాట్ టాపిక్ గా మారింది. అక్కడితో ఆగకుండా యువకు లైంగిక సమస్య కూడా ఉందని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు యువ తరఫున లాయర్ మరొకరితో శ్రీదేవి సన్నిహితంగా ఉందని చెప్పి మరింత సెన్సేషన్ చేశాడు. ఇక యువ రాజ్‌కుమార్.. తన భార్య శ్రీదేవి తనను విపరీతంగా హింస పెడుతుందని ఆరోపించగా.. కావాలానే యువ కట్టు కథలు చెబుతున్నాడని, వేరొకరితో సంబంధం వల్లే ఇలా చెబుతున్నాడని శ్రీదేవి చెప్పుకొచ్చింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker