Health

భార్యభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువైతే వాళ్ళు ఇక విడాకులేనా..? వెలుగులోకి షాకింగ్ విషయాలు.

ఇద్దరు వేర్వేరు వ్యక్తులు వివాహం అనే బంధంతో ఒక్కటై జీవితాంతం కలిసి ఉంటారు. ఇలా ఒక్కటైన వారు కలకాలం కలిసి ఉంటారు. పూర్వ కాలంలో అమ్మాయి, అబ్బాయి మోహం చూపించకుండానే పెళ్లిళ్లు చేసేవారు. పెద్దలు చెప్పిన విధంగా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. కానీ కాలం మారుతున్న కొద్దీ దాంపత్య జీవితంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు పెద్దలు వివాహాన్ని కుదిర్చితే.. ఇప్పుడు పెళ్లి కాకుండానే కొన్నాళ్లపాటు కలిసుండే రోజులు వచ్చాయి.

అయితే పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా ఆనందంగా ఉంటుందని ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. ఎన్నో మార్పులు జరగొచ్చు, కానీ వివాహ జీవితం ఎక్కువ సంతోషంగా ఉండాలంటే.. భార్యభర్తల మధ్య వయసు చాలా కీరోల్‌ ప్లే చేస్తుంది. కొంతమంది అమ్మాయి కంటే.. అబ్బాయి వయసు ఎంత పెద్దగా ఉన్న పర్వాలేదు అనుకుంటారు. ఏడు ఎనిమిదేళ్లు పెద్దగా ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేసేందుకు కూడా వెనకాడరు. అసలు భార్య భర్తల మధ్య ఎంత ఏజ్‌ గ్యాప్‌ ఉండాలి.

అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధన ప్రకారం, భార్యాభర్తల మధ్య సరైన ఏజ్‌ గ్యాప్‌ 3 నుండి 5 సంవత్సరాలు మాత్రమే ఉండాలట. ఈ పరిశోధన ప్రకారం, ఐదు సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉన్న జంటలు విడాకులు తీసుకునే అవకాశం 18 శాతం మాత్రమే ఉంటుందని తేలింది. భార్యాభర్తల మధ్య 10 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉంటే, విడాకులు తీసుకునే అవకాశం 39 శాతం వరకు ఉంటుంది.

దంపతుల మధ్య 20 ఏళ్ల వయస్సు అంతరం ఉంటే, విడాకుల అవకాశం 95 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. వివాహం కోసం భార్యాభర్తల మధ్య సరైన వయస్సు వ్యత్యాసం ఉండాలి. ఏజ్ గ్యాప్ పెరిగితే, ఇద్దరి మధ్య ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల రిలేషన్ షిప్ బ్రేక్ అప్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒకే వయసులో ఉన్నవాళ్ల వారి ఆలోచనా విధానం ఇంచుమించు ఒకేలా ఉంటాయి.

ఎందుకంటే.. వారు చిన్నప్పటి నుంచి ఒకలాంటి సొసైటీని, ఒకేమార్పులను చూస్తారు. అప్పుడు అర్థం చేసుకోవడానికి ఎక్కువ పాజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీ పేరెంట్స్‌ ఆలోచనా విధానానికి, మీ మైండ్‌సెట్‌కు చాలా తేడా ఉంటుంది. అందుకే 3-5 సంవత్సరాల గ్యాప్‌ వరకు ఉంటేనే వివాహ జీవితం బాగుంటుందని పరిశోధకులు అంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker