అప్పుడే వేరు కాపురం పెట్టిన నాగశౌర్య, కోడలి గురించి షాకింగ్ విషయాలు చెప్పిన హీరో తల్లి.
నాగశౌర్య గత సంవత్సరం పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఆయనను పెళ్లి చేసుకున్న అమ్మాయి కర్ణాటకకు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. ఆవిడ పేరు అనూష శెట్టి. గత ఏడాది ఒక పెద్ద హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తాజాగా, ప్రముఖ టాలీవుడ్ హీరో నాగశౌర్యపై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఆయన వేరు కాపురం పెట్టడమే ఇందుకు ప్రధాన కారణం. మొన్నటి వరకు ఇవి పుకార్లుగానే ఉండేవి.
ఎలాంటి క్లారిటీ లేని సమయంలో కూడా విమర్శలు చేస్తున్నారు. తల్లిదండ్రులను వదలి పెట్టి ఎలా పక్కకు పోతావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా. అయితే, నాగశౌర్య వేరు కాపురంపై ఆయన తల్లి తాజాగా స్పందించారు. ఉషా మల్పూరి మీడియాతో మాట్లాడుతూ.. అనూష శెట్టిని నాగశౌర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపారు.
2022 నవంబర్ 20న వీరి వివాహం జరిగిందని వెల్లడించారు. బెంగుళూరుకు చెందిన అనూష.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోయిందని, ఇక్కడే ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుందని తెలిపారు. అయితే! పెళ్లయిన కొన్నిరోజులకే వీరిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి వేరు కాపురం పెట్టారని రూమర్స్ వచ్చాయని అన్నారు.
వారు పెళ్లయిన కొన్నిరోజులకే వేరు కాపురం పెట్టారని, ఇదంతా పెళ్లికి ముందే మాట్లాడుకున్నామని చెప్పారు. ‘‘ అనూష చాలా మంచి పిల్ల. శౌర్యతో పెళ్లికాకముందు నుండే అనూషతో పరిచయం ఉంది. శౌర్యతో తన జోడీ బాగుంటుందని అనిపించి పెళ్లి జరిపించాము. అనూషను కూతురిలాగానే చూశాము. తను కూడా మమ్మల్ని తల్లిదండ్రుల్లా చూసుకునేది. మమ్మల్ని మమ్మీ, డాడీ అని పిలుస్తుంది.
తను ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకునే ఆఫీసుకు వెళ్తుంది. బాగా ఆలోచించే అమ్మాయి. శౌర్య, అనూష వేరుగా ఉండాలని ముందు నుండే అనుకున్నారు. ఈ తరంలో పిల్లలకు స్వేచ్ఛ కావాలి కాబట్టి వారికి ఇచ్చాము. ఇందులో వేరుగా ఆలోచించడానికి, అనుకోవడానికి ఏమీ లేదు’’ అని అన్నారు.