Health

గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడా ఎలా ఉంటుందో తెలుసా..?

వ్యాయామం చెయ్యాలి. ఎందుకంటే ఇది రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్‌ను చాలా ఈజీగా తగ్గిస్తుంది. అయితే తేలికైన వ్యాయామాలు ఇంకా వర్కవుట్లు మాత్రమే చేయలి. ఎందుకంటే శారీరక శ్రమ లేకపోతే గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం బాగా పెరుగుతుంది.మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే అవిసె గింజలు, వాల్‌నట్‌లు ఇంకా అలాగే అవకాడోలను ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ఫిట్‌గా ఉన్న వారితో పాటు యుక్తవయసులో ఉన్నవారు కూడా గుండె ఆగిపోయి హఠాత్తుగా మరణిస్తున్నారు. ఇటీవల కాలంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ అటాక్ కారణంగా చనిపోయారు.

డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా గుండెపోటు వచ్చి హఠాన్మరణం చెందిన వారు ఉన్నారు. కార్డియాక్ అరెస్ట్.. గుండె పని చేయడం హఠాత్తుగా ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. స్పృహ కోల్పోవడం స్పందించకపోవడం కార్డియాక్ అరెస్ట్‌ను తెలిపే ప్రధాన సంకేతాలు. దీనికి గురైన వారిని తక్షణమే రక్షించకపోతే వారు అక్కడికక్కడే చనిపోతారు. హార్ట్ స్ట్రోక్.. హార్ట్ స్ట్రోక్‌ను బ్రెయిన్ ఎటాక్ అని కూడా అంటారు. దీని వల్ల మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుంది. ఫలితంగా మెదడులోని కొంత భాగం చనిపోతుంది. గుండెపోటు.. సాధారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు సంభవిస్తుంది.

రక్తం గడ్డకట్టినప్పుడు గుండెకు రక్త సరఫరా సడన్‌గా ఆగిపోతుంది. అప్పుడు గుండెపోటు వచ్చి మరణం సంభవిస్తుంది. వైద్యుల ప్రకారం ఇండియాలో అనారోగ్య జీవనశైలి, పెరిగిన ఒత్తిడి వల్ల గుండె సంబంధిత మరణాల సంఖ్య పెరుగుతోంది. గుండెపోటుకు అసలైన కారణం ధమనులలో కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోవడం. ఈ కొలెస్ట్రాల్ ఒక్కసారిగా విచ్ఛిన్నమైనప్పుడు అది గుండెపోటుకు దారితీస్తుంది. కోవిడ్ కూడా గుండెపోటుకు దారితీసే మరో అంశమని నిపుణులు చెబుతున్నారు. గుండె సంబంధిత ప్రాణాంతక అనారోగ్య పరిస్థితులను గుర్తించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

ఛాతీ మధ్యలో అసౌకర్యంగా లేదా నొప్పిగా అనిపిస్తే అది హార్ట్ ఎటాక్ రావడానికి సంకేతం కావచ్చు. ముఖం, కాలు లేదా చేయి భాగాలలో ఒక వైపున ఉన్నపళంగా బలహీనంగా అనిపించినా లేదా తిమ్మిరి పట్టిన ఫీలింగ్ వచ్చినా.. బలం, దృష్టిని కోల్పోవడం లేదా మాట్లాడటంలో ఇబ్బంది ఎదురైనా కూడా అది గుండె సంబంధిత రుగ్మతకు కారణమవ్వచ్చు. కొద్దిసేపు మూర్ఛపోవడం, తల తిరగడం సంకేతాలు కూడా ఈ అనారోగ్య పరిస్థితులను తెలివేనని వైద్యులు తెలిపారు. ఎలా కాపాడాలి.. పైన పేర్కొన్న లక్షణాలను గమనించిన తర్వాత, రోగికి ఒక ఫాస్ట్ టెస్ట్ చేయడం చాలా ముఖ్యం.

ఫాస్ట్ టెస్ట్ అంటే ఫేస్, ఆర్మ్స్, స్పీచ్, టైమ్ ఇలా నాలుగు విధాలుగా టెస్ట్ చేయడం. ఫేస్‌లో ముఖ కవళికలు బట్టి కూడా వారి పరిస్థితి ఏమిటనేది నిర్ధారించవచ్చు. పైన లక్షణాలు కనిపించిన తర్వాత వారిని మీరు నవ్వమని అడగాలి. వారి ముఖంలో చిరునవ్వు సరిగ్గా కనిపించకుండా.. ముఖభాగం ఒకవైపు వంకరగా ఉన్నట్టు కనిపిస్తే జాగ్రత్తపడాలి. ఆర్మ్స్ అంటే చేతులు. చేతులను పైకెత్తితే కూడా మీకు ఒక సంకేతంగా కనిపిస్తుంది. అది ఏంటంటే రెండు చేతులను పైకి ఎత్తినప్పుడు ఒక చేయి ఇతర చేతితో పోలిస్తే సాగిపోయి కనిపిస్తుంది. వారి స్పీచ్‌లో ఏదైనా అస్పష్టంగా లేదా వింతగా సౌండ్ వినిపించినా వారిని సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker