Health

ఈ కాలంలో డయాబెటిస్ రోగులు ఈ పండ్లు తినకపోవడమే మంచిది.

డయాబెటిస్‌ ఉన్న చాలా మంది ఆహార నియమాలు సరిగ్గా పాటించరు. సరైన సమయానికి మందులు వేసుకోవడం, ఆహారం తీసుకోవడం వంటివి పాటించడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. డయాబెటోలోజియాలో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం నిర్ణీత సమయంలో తినడం ద్వారా శరీరంలోని జీవక్రియ మెరుగుపడుతుంది. అయితే పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.

అందుకే ఏదా వ్యాధి లేదా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు ముందుగా పండ్లు తినడం అలవాటు చేసుకుంటాం. వైద్యులు కూడా పండ్లు తినమనే సలహా ఇస్తుంటారు. అయితే అన్ని సందర్భాల్లోనూ కాదు. డయాబెటిస్ వ్యాధి విషయంలో మాత్రం అప్రమత్తత అవసరం. కొన్ని రకాల పండ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఇవి శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతాయి. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువైనప్పుడు డయాబెటిస్ అధికమౌతుంది.

మీరు తినే ఆహార పదార్ధాల ద్వారా షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు నియంత్రణ కష్టమే. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా ఉంటేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా కొన్నిరకాల పండ్ల విషయంలో దూరం పాటించాలి. పండ్ల గ్లైసోమిక్ ఇండెక్స్ 100 నుంచి 70 మధ్య ఉంటే ఆ పండ్లు లేదా కూరగాయలు తినకూడదు. డయాబెటిస్ ఉన్నప్పుడు గ్లైసోమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తినకూడదు.

ఏ పండ్లు తినకూడదు.. పుచ్చకాయ, ఎండి రేగుపండ్లు, పైనాపిల్, అరటిపండ్లు, బత్తాయి, కిస్‌మిస్, ద్రాక్ష, ఖర్జూరం వంటి స్వీట్‌నెస్ ఎక్కువగా ఉండే పండ్లలో గ్లైసోమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల షుగర్ లెవెల్ పెరుగుతుంది. వీటిని దూరం పెట్టాలి. ఇక కూల్‌డ్రింక్స్, వైట్ బ్రెడ్, వైట్ రైస్, బంగాళ దుంపలో కూడా గ్లైసోమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. గ్లైసోమిక్స ఇండెక్స్‌తో పాటు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆహారం కూడా తినకూడదు. మామిడి, ద్రాక్ష, యాపిల్, అరటి పండ్లలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker