Health

షుగర్ ఒక్కసారి వస్తే జీవితంలో తగ్గదా..? ఈ చిట్కాలు పాటించి చుడండి. అసలు విషయం మీకే తెలుస్తుంది.

ప్రమాదకరమైన ఈ వ్యాధి బారిన భారత దేశంలో సుమారుగా 7 కోట్ల మంది ప‌డిన‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. మ‌రి ఇంత‌మందిని బాధిస్తున్న మ‌ధుమేహం ఎలా వ‌స్తుంది అన్నదానికిపై అనేక మందిలో చాలా సందేహాలు ఉన్నాయి. చ‌క్కెర వ్యాధి చ‌క్కెర ఎక్కువ‌గా తినటం వల్లనే వస్తుందని భావిస్తారు. అయితే నిజానికి షుగర్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1 డయాబెటిస్, రెండోది.. టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ వస్తే మాత్రం నిజంగా తగ్గదు. దాని కోసం జీవితాంతం ట్యాబ్లెట్లు వాడాల్సిందే. ఇది ఎక్కువగా వంశపారపర్యంగా, పిల్లలకు వస్తుంటుంది.

టైప్ 1 డయాబెటిస్ అంటే.. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోవడం వల్ల వచ్చే వ్యాధి. ఇన్సులిన్ ఉత్పత్తి కాదు కాబట్టి.. ప్రతి రోజు ఇన్సులిన్ కోసం ట్యాబ్లెట్లు కానీ.. ఇంకా వేరే పద్ధతులు కానీ వాడాల్సి ఉంటుంది.అదే టైప్ 2 డయాబెటిస్ అంటే.. ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపేయడం వల్ల వచ్చే వ్యాధి. దీన్ని సహజ పద్ధతుల్లో నివారించుకోవచ్చు. ఇన్సులిన్ ఉత్పత్తి జరిగేలా చూసుకుంటే టైప్ 2 డయాబెటిస్ ను తరిమికొట్టొచ్చు. ప్రకృతికి దగ్గరగా బతికితే.. ఎటువంటి రోగాలు రావు. అంటే.. ప్రకృతే మనకు అమ్మ లాంటిది. ప్రకృతికి దూరంగా వెళ్తే.. రోగాలు కూడా పెరుగుతుంటాయి.

అందుకే.. ప్రకృతి ఇచ్చే ఆహారాన్ని తీసుకొని.. ప్రకృతితో మమేకమై.. జీవన విధానాన్ని మార్చుకుంటే.. షుగర్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు.దాని కోసం రోజూ ఓ రెండు జ్యూస్ లు తాగాలి. అందులో ఒకటి కొత్తిమీర, పూదీన, తులసి ఆకుల జ్యూస్. కొన్ని కొత్తిమీర, పూదీన, తులసి ఆకులను తీసుకొని.. వాటిని జ్యూస్ చేసి.. పిప్పి తీసేసి.. అందులో ఇంత నిమ్మకాయ రసం కలుపుకొని తాగాలి. షుగర్ ఉంది కాబట్టి.. కొంచెం వేసి వేయనంత తేనె వేసుకొని ప్రతి రోజు ఉదయం టిఫిన్ కంటే ముందు తాగాలి. కనీసం 15 రోజులు ఇలాగే తాగాలి. ఆ తర్వాత ఓ గంట గ్యాప్ ఇచ్చి ఏదైనా టిఫిన్ తింటే చాలు. మళ్లీ సాయంత్రం పూట మునగాకు జ్యూస్ తాగాలి.

లేత మునగాకులను తీసుకొని కొన్ని నీళ్లు కలిపి మిక్సీ పట్టి.. వడకట్టి.. ఆ జ్యూస్ లో కాసింత నిమ్మకాయ పిండి.. కొంచెం తేనె కలుపుకొని తాగొచ్చు. సాయంత్రం పూట అన్నం తినడానికి ఓ గంట ముందు ఈ జ్యూస్ తాగాలి.ఇలా.. కనీసం 15 రోజుల పాటు కంటిన్యూగా ఈ రెండు జ్యూస్ లను ఉదయం, సాయంత్రం తాగితే.. షుగర్ లేవల్స్ కంట్రోల్ అవుతాయి. 15 రోజుల తర్వాత షుగర్ టెస్ట్ చేయించుకుంటే.. ఆ తేడా మీకే కనిపిస్తుంది. షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉన్నా.. మునపటి కన్నా.. తగ్గినా.. వెంటనే మరో 15 రోజులు అదే డైట్ షీట్ ను ఫాలో అవ్వాలి. అలా కంటిన్యూగా.. కనీసం మూడు నుంచి నాలుగు నెలల పాటు.. ఆ డైట్ షీట్ ను ఫాలో అయితే.. మీ వంట్లో షుగర్ ఉండమన్నా ఉండదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker