డయాబెటిస్ ఉన్నవారికి కిడ్నీ సమస్య కూడా వస్తాయా..?
సాధారణంగా మధుమేహం లేదా చక్కెర వ్యాధిని రక్తంలో మితిమీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. వైద్య పరంగా చూస్తే.. క్లోమ గ్రంథిగా పిలిచే పాన్‌క్రియాస్‌లో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. మనం తినే ఆహారంలోని పిండిపదార్థాలను శరీరం ముక్కలుగా చేసి చక్కెరగా మారుస్తుంది. అయితే డయాబెటిస్ వుంది కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు ఇలా అనుసరిస్తే ఆరోగ్యం బాగుంటుంది.
లేదంటే లేనిపోని ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బ్లడ్ షుగర్ కంట్రోల్.. బ్లడ్ గ్లూకోస్ ని కంట్రోల్ చేసుకోవడం వలన కిడ్నీ సమస్యల ప్రమాదం తగ్గుతుంది. బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకుంటే కిడ్నీ సమస్యలు తగ్గుతాయని గుర్తుంచుకోవాలి రెగ్యులర్ గా వ్యాయామం చేయడం మందులు వేసుకోవడం చాలా ముఖ్యం ఇలా చేయడం వలన ఆరోగ్యం బాగుంటుంది ఈ సమస్యలు తగ్గుతాయి.
బ్లడ్ ప్రెషర్ కంట్రోల్.. డయాబెటిస్ తో బాధపడే వారికి బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది అయితే ఇలా బీపీ ఉండడం వలన కిడ్నీ సమస్యలు మరింత ఎక్కువవుతాయి కాబట్టి బీపీని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. పొగాకు కి దూరంగా ఉండాలి.. పొగాకు తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు మరింత ఎక్కువవుతాయి కాబట్టి పొగాకు కి దూరంగా ఉండండి.
జీవన విధానంలో మార్పులు.. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం సాల్ట్ ని తగ్గించడం వంటివి తప్పకుండా చేయండి. కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు ప్రోటీన్ చాలా తక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలానే జంక్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. మందులు.. డాక్టర్ సలహా తీసుకుని రెగ్యులర్గా మందుల్ని వేసుకుంటూ ఉండాలి దీని వలన కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండొచ్చు ప్రమాదం కూడా తగ్గుతుంది.