గొప్ప మనసు చాటుకున్న ధోని, అభిమాని సర్జరీకి అయ్యే డబ్బుల్ని భరిస్తానని చెప్పిన ధోని.
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మే 10న మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకుని గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చి.. కాళ్లకు నమస్కరించాడు. అనంతరం హగ్ చేసుకున్నాడు. అయితే అభిమాన ఆటగాళ్లను దగ్గర నుంచి చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారు.
వాళ్ల ఆటోగ్రాఫ్స్, సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. కొందరు అభిమానులైతే ఏకంగా మ్యాచ్ జరిగే చోటకు సెక్యూరిటీని దాటి వెళ్లిపోతుంటారు. ఇలా వెళ్లిన వారిని అధికారులు అదుపులోకి తీసుకొని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తన ఫ్యాన్ విషయంలో మాత్రం ధోని మంచి మనసుతో వ్యవహరించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఓ అభిమాని మాహీని కలిసేందుకు భద్రతా వలయాన్ని దాటుకొని మరీ పిచ్ దగ్గరకు దూసుకొచ్చాడు.
అతడ్ని ఏమీ అనకుండా హగ్ చేసుకున్నాడు సీఎస్కే మాజీ కెప్టెన్. ఆ ఫ్యాన్‌తో కొద్దిసేపు ముచ్చటించాడు మాహీ. అయితే మాటల సమయంలోనే అతడికి శ్వాస సంబంధిత సమస్య ఉందని గుర్తించాడు. యువకుడి సర్జరీకి అయ్యే డబ్బుల్ని భరిస్తానని మాటిచ్చాడు ధోని. అతడి మీద చేయి వేస్తే బాగోదంటూ సెక్యూరిటీ సిబ్బందికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆ ఫ్యాన్ రివీల్ చేశాడు. మాహీ తన ఆరోగ్య సమస్యను వెంటనే గుర్తించి.. సర్జరీకి అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చాడన్నాడు.
నీకేం కాదని.. నేనున్నానంటూ భరోసా ఇచ్చాడని ఆ అభిమాని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. మాహీ గొప్ప మనసుకు ఇది నిదర్శనమని చెబుతున్నారు. ఇందుకే ఈ స్థాయికి చేరుకున్నాడని, అభిమానులకు అండగా నిలిచిన ధోనీకి సెల్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అభిమాని సర్జరీకి మాహీ సాయం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The fan who invaded the pitch to meet MS Dhoni had breathing issues.
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2024
MS when the fan tells him this – "I will take care of your surgery. Nothing will happen to you, don't worry. I won't let anything happen to you". ❤️pic.twitter.com/9uMwMktBxZ