News

కార్తీక పౌర్ణమి నుంచి ఈ ఈ రాశుల వారికి పట్టిందల్ల బంగారమే, ఆ రాశులు ఏంటంటే..?

కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అయితే హిందూ మతంలో దేవ దీపావళి ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను కార్తీక మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి, దేవీ దేవతలందరూ గంగా ఘాట్ వద్ద దీపావళిని జరుపుకుంటారు. అంతేకాదు ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని కూడా నమ్ముతారు. అందుకే దీనిని త్రిపురి పూర్ణిమ, త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ సంవత్సరం దేవ దీపావళి సందర్భంగా కొన్ని అరుదైన యాదృచ్ఛికాలు చోటుచేసుకుంటున్నాయి.

కొన్ని రాశుల వారికి ఇది చాలా శుభప్రదం. దేవ దీపావళి ఎప్పుడంటే.. వేద పంచాంగం ప్రకారం కార్తీక మాసం పౌర్ణమి తిధి నవంబర్ 15 ఉదయం 6.19 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పౌర్ణమి తిధి నవంబర్ 16వ తేదీ తెల్లవారుజామున 2:58 గంటలకు ముగుస్తుంది. దీంతో నవంబర్ 15న కార్తీక పౌర్ణమిని జరుపుకుంటున్నారు. దేవ దీపావళి ప్రదోష కాల శుభ సమయం. పంచాంగం ప్రకారం దేవ దీపావళి రోజున ప్రదోష కాల ముహూర్తం నవంబర్ 15 సాయంత్రం 5.10 నుంచి 7.47 వరకు ఉంటుంది. దీంతో ఈ రోజు పూజకు మొత్తం సమయం 2 గంటల 37 నిమిషాలు లభిస్తుంది. దేవ దీపావళి శుభ యోగం..దేవ దీపావళి రోజున చంద్రుడు వృషభరాశిలో ఉంటాడు. దీని కారణంగా బృహస్పతి ప్రభావంతో గజకేసరి యోగం ఏర్పడుతోంది. అంతేకాదు శనీశ్వరుడు తన మూల త్రిభుజ రాశిలో సంచరిస్తున్నాడు.

దీంతో శశ రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడు, బృహస్పతి ఒకరి రాశులను మరొకరు మార్చుకోనున్నారు. దీని ద్వారా రాజయోగాన్ని సృష్టిస్తున్నారు. అయితే కర్కాటకరాశిలో కుజుడు మీనరాశిలో రాహువుతో నవపంచం రాజయోగాన్ని సృష్టిస్తున్నారు. ఈ అరుదైన కలయికల వలన కొన్ని రాశికి చెందిన వ్యక్తులు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఏ రాశుల వారికి శుభప్రదం అంటే..వృషభ రాశి వారికి దేవ దీపావళి చాలా పవిత్రమైనది.. ప్రయోజనకరమైనది. ఈ సమయంలో వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. పురోగతికి అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఆస్తి కొనుగోలు చేయాలనే కల నెరవేరుతుంది. అంతేకాదు ఆర్థికంగా లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి.

వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందం, శాంతి ఉంటుంది. మిధున రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై కూడా ఈ అరుదైన యాదృచ్ఛికాలు సానుకూల ప్రభావం చూపిస్తున్నాయి. వీరికి ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రేమ సంబంధాలలో సమన్వయం ఉంటుంది. వివాహ అవకాశాలు కూడా ఉన్నాయి. క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా లాభాలకు అవకాశాలు ఉంటాయి. ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ యోగాలు చాలా మేలు చేస్తాయి. ఈ కాలంలో ధనుస్సు రాశి వారికి వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉండవచ్చు. అలాగే అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌తో పాటు జీతం కూడా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. కుంభ రాశి: దేవ దీపావళి కుంభ రాశి వారికి కూడా చాలా ప్రత్యేకమైనది. వీరికి శనిదేవుడితో పాటు శుక్ర, గురుగ్రహాల విశేష ఆశీస్సులు ఉంటాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో అధిక లాభాలు పొందవచ్చు. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇప్పటికే ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. వాటి నుంచి ఉపశమనం పొందుతారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker