Health

రోజు రెండు డేట్స్‌ తింటే చాలు, మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన పని ఉండదు.

ఖర్జూరం తింటే, అందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు చాలా ఉంటాయి కాబట్టి శరీరానికి మంచిదే. కానీ ఖర్జూరాలను అధికంగా తీసుకోవడం మాత్రం కొందరికి మంచిది కాదు. అయితే ప్ర‌తిరోజూ రెండు, మూడు డేట్స్‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటే అద్భుత ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం స్నాక్స్ కింద డేట్స్‌ను తీసుకుని మెరుగైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని సూచిస్తున్నారు.

డేట్స్ ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయే వ్య‌ర్ధాల‌ను తొల‌గిస్తాయి. ధ‌మ‌నులు మూసుకుపోయేలా పేరుకుపోయే లైమ్‌ను ఖ‌ర్జూర పండ్లు తొల‌గిస్తాయి. దీంతో స్ట్రోక్‌లు, గుండె పోటు, ఇత‌ర వ్యాధుల ముప్పు నుంచి డేట్స్ కాపాడ‌తాయి. రోజుకు మూడు డేట్స్ తీసుకోవ‌డం ద్వారా తీవ్ర అనారోగ్యాల బారిన ప‌డే ముప్పు త‌గ్గుతుంది. ఇక కాలేయాన్ని కూడా ఖ‌ర్జూరాలు ఆరోగ్యంగా ఉంచుతాయ‌ని ప‌లు అధ్య‌యనాల్లో వెల్ల‌డైంది.

గుండెకు ఖ‌ర్జూరాలు ఎంతో మంచిద‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పొటాషియం కార్డియోవాస్క్యుల‌ర్ జ‌బ్బుల‌ను నిరోధిస్తుంది. ఇది శ‌రీరంలో పేరుకుపోయే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డం ద్వారా స్ట్రోక్‌, గుండెపోటు ముప్పు నియంత్రిస్తుంది. డేట్స్‌లో ఉండే విట‌మిన్ ఏ కండ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

హానికార‌క యూవీ రేస్‌తో పోరాడుతుంది. స్నాక్స్‌లా డేట్స్‌ను తీసుకుంటే త‌క్ష‌ణ శ‌క్తి స‌మ‌కూరుతుంది. డేట్స్‌లో ఉండే ఔష‌ధ గుణాలు శ‌రీరంలో టాక్సిన్స్‌ను బ‌య‌ట‌కు పంప‌డ‌మే కాకుండా ఇందులో ఉండే ఫైబ‌ర్ మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని దూరం చేస్తుంది. అమినో ఆమ్లాలు జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేస్తాయి. ఇక డేట్స్‌లో ఉండే మెగ్నీషియం శ‌రీరంలో నొప్పిని, వాపు నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker