ఇలా చేస్తే డెంగ్యూ జ్వరం మిమ్మల్ని ఏం చెయ్యలేదు.
డెంగ్యూ జ్వరం డెంగ్యూ వైరస్ వల్ల వచ్చే దోమల వల్ల కలిగే వ్యాధి . లక్షణాలు సాధారణంగా సంక్రమణ తర్వాత మూడు నుండి పద్నాలుగు రోజుల తరువాత ప్రారంభమవుతాయి. ఇందులో అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మపు దద్దుర్లు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడటానికి సాధారణంగా రెండు నుండి ఏడు రోజులు పడుతుంది. అయితే వర్షాకాలంలో ఈ కీటకాల వల్ల దోమలు మరింత వ్యాప్తి చెంది డెంగ్యూ వ్యాధులకు దారి తీసే అవకాశాలున్నాయి. అయితే ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలాని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
ముఖ్యంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సిట్రస్ ఫుడ్స్ పుష్కలంగా ఉన్న అన్ని రకాల ఆహారాలు తీసుకుంటే డెంగ్యూ వ్యాధితో పోరడే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అల్లం టీకి రుచిని పెంచేందుకు కృషి చేస్తుంది. అల్లంలో ఉండే మూలకాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషి చేస్తుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకుంటే గొంతు నొప్పి, వాపు, వికారం, డెంగ్యూ జ్వరం వంటి సమస్యలు దూరమవుతాయి. పసుపును యాంటీబెటిక్‌గా వినియోగిస్తారు. అంతేకాకుండా దీని గురించి ఆయుర్వేద శాస్త్రంలో క్లుప్తంగా వివరించారు.
ఇందులో ఔషధ గుణాలున్నాయని దీనిని ఆహారం వండే క్రమంలో వినియోగిస్తే అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు పూర్కొన్నారు. అంతేకాకుండా డెంగ్యూ వంటి వ్యాధుల నుంచి సంరక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి ఆయుర్వేద శాస్త్రంలో గొప్ప ఔషధంగా పరిగణిస్తారు. దాదాపు ప్రతి భారతీయ వంటకాల్లో దీనిని వినియోగిస్తారు. ఇందులో శరీర రోగనిరోధక శక్తిని పెంచే మూలకాలున్నాయి. ఇది వ్యాధుల నుంచి సంక్రమణతో పోరాడటానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో సల్ఫర్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
పెరుగు శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరుచుతాయి. అయితే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రెడ్‌గా ఉంచడమేకాకుండా అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. అంతేకాకుండా డెంగ్యూ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. బాదం నట్స్‌లో చాలా రకాల పోషకాలుంటాయి. ఇందులో విటమిన్ ఇ అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా గుండెను ఆరోగ్యవంతంగా చేస్తుంది. కావున వానా కాలంలో ప్రతి ఒక్కరు బాదం తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.