డెల్టా వేరియంట్‌తో వణికిపోతున్న ఆ దేశం, అది సోకితే..?

డెల్టా వేరియంట్‌తో వణికిపోతున్న ఆ దేశం, అది సోకితే..?

ఐరోపా ఖండం మొత్తాన్ని ఆక్రమించగలిగిన స్థితికి ‘డెల్టా’ చేరుకుందని డబ్ల్యూహెచ్ఓ ఐరోపా శాఖ డైరెక్టర్ తాజాగా పేర్కొన్నారు. కొన్ని కరోనా టీకాల నుంచి తప్పించుకునే శక్తి డెల్టా వేరియంట్‌కు ఉన్నట్టు ఇప్పటికే రుజువైందన్న విషయాన్నీ ఆయన ప్రస్తావించారు. అయితే డెల్టా వేరియంట్ కేసులు తమ దేశంలోనూ నమోదుకావడం పట్ల చైనా ఆందోళన చెందుతోంది. వైరస్‌ లక్షణాలు తెలిసిన వెంటనే గ్యాంగ్‌ జూహూ నగరంలో లాక్‌డౌన్‌ విధించింది.

ఆ దేశంలో 27 మిలియన్ల ప్రజలకు మూకుమ్మడిగా కరోనా పరీక్షలు నిర్వహించారు. జనం భారీ క్యూలైన్లలో నిల్చొని కొవిడ్ పరీక్షలు చేయించుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటు కఠిన కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించని వారిని గుర్తించి పోలీసులు చర్యలు చేపడుతున్నారు. పశ్చిమ గ్యాంగ్‌జూహూలోని లివాన్‌ ప్రాంతంలో డెల్టా వేరియంట్‌ ఉనికిని నిపుణులు గుర్తించారు.

తక్షణమే లివాన్‌ లో లాక్‌డౌన్ విధించి షాపులు ,రెస్టారెంట్లు మూసివేయించారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు డెల్టా వేరియంట్‌ విస్తరించకుండా కఠిన చర్యలు చేపట్టారు. మెట్రోస్టేషన్ల మూసివేతతో పాటు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.గ్యాంగ్‌జూహూ ఇంటర్నెషనల్‌ ఎయిర్‌ పోర్ట్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దుచేశారు. లివాన్‌ పట్టణంలో డ్రైవర్‌ లెస్‌ కార్ల ద్వారా సరకులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన శిక్షలు తప్పవంటూ హెచ్చరిక జారీ చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *