దేశాన్ని బయపెడుతున్న డెల్టా వేరియంట్. ఇదే థర్డ్ వేవ్‌కి చూచనలా..?

దేశాన్ని బయపెడుతున్న డెల్టా వేరియంట్. ఇదే థర్డ్ వేవ్‌కి చూచనలా..?

ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు సుమారు రోజుకు 8 వేల కోవిద్ కేసులు నమోదవుతున్నాయి. గతవారం పాజిటివ్ కేసులు ఒక్కసారిగా 50 శాతం పెరిగాయి. ఈ కారణంగా మొదట ఇంగ్లాండ్ లో ఆంక్షలను పొడిగించాలని బోరిస్ ప్రభుత్వం భావిస్తోంది. నాలుగు రకాల వేరియంట్లలో డెల్టా వేరియంట్ ను అదుపు చేయడానికి ఎక్కువ కాలం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇండియాలో కరోనా సెకండ్‌వేవ్ అత్యంత తీవ్రంగా ఉండటానికి కారణం డెల్టా వేరియంట్. మన అదృష్టం కొద్దీ అది త్వరగానే బలహీనపడింది. దాని జోరు తగ్గడంతో… ఇండియాలో కరోనా కేసులు తగ్గుతున్నాయి.

ఇలాంటి సమయంలో… చేదువార్తగా డెల్టా ప్లస్ అనేది నిలుస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం… జూన్ 7 నాటికి డెల్టా ప్లస్ సోకిన కేసులు 6 ఉన్నాయి. దీన్ని డెల్టా ప్లస్ అని ఎందుకు అన్నారంటే… డెల్టా వేరియంట్‌లో మార్పులు వచ్చాయి. కొత్త మార్పులతో ఉన్న వేరియంట్‌ను డెల్టా ప్లస్ లేదా AY.1 వేరియంట్ అని పిలుస్తున్నారు. ఆరు కేసులే వచ్చాయి కాబట్టి దీనిపై భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేరు అంటున్నారు.

డెల్టా వేరియంట్‌ను సైంటిఫిక్ భాషలో B.1.617.2 అని పిలుస్తున్నారు. దీన్ని మొదటిగా ఇండియాలోనే కనిపెట్టారు. ఆ తర్వాత చాలా దేశాల్లో కనిపించింది. ఇండియాలో సెకండ్‌వేవ్‌లో ఎక్కువ కేసులు, మరణాలు రావడానికి కారణం ఇదే. డెల్టా ప్లస్ అనేది… దీని కంటే బలంగా ఉంది. అంటే… ఈమధ్య ఇండియాలో అనుమతించిన యాంటీబాడీ కాక్‌టెయిల్‌ని… ఈ కొత్త వేరియంట్ తట్టుకోగలుగుతోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *