Health

పిల్లలు పుట్టాక పై శృంగారంపై ఆస‌క్తి త‌గ్గిపోయిందా..? అయితే ఈ విషయాలు మీ కోసమే.

వ‌య‌సు మ‌ళ్లిన వారిలో శృంగార కోరిక‌లు త‌గ్గ‌డానికి వ‌య‌సే కార‌ణ‌మైతే, వ‌య‌సులో ఉన్న‌వారిలో శృంగార కోరిక‌లు త‌గ్గ‌డానికి జీవ‌న‌విధానంలో మార్పులు, మితిమీరిన శారీర‌క శ్ర‌మ‌, అల‌స‌ట‌, మానసిక ఒత్తిడి లాంటివి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. వృద్ధుల్లో శృంగార వాంఛ త‌గ్గ‌డం సాధార‌ణం కాబ‌ట్టి ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, యుక్త వ‌య‌స్కులు మాత్రం ఇలాంటి స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాల్సిందే. అయితే డెలివరీ అయిన త‌ర్వాత చాలా మందిలో ఉండే స‌ర్వ‌సాధార‌ణ‌మైన డౌట్ సెక్స్‌.

అవును, కొత్తగా తల్లి అయిన వారికి శిశువు పుట్టాక శృంగారం కావాలి అనిపించకపోవడం చాలా సాధారణం. కొత్తగా తల్లి అయిన వారు శృంగారానికి చివరి ప్రాధాన్యత ఇస్తారు. తల్లికి బిడ్డ మీదనే తన శ్రద్ధ మరియు ధ్యాస ఉంటుంది. ఆ స‌మ‌యంలో భ‌ర్త‌ను ప‌ట్టించుకోవాలి అనే ఆలోచ‌న చాలా త‌క్కువ‌గా ఉంటుంది. కొత్త బాధ్యతలు, కొత్త జీవనవిధానాన్ని అలవాటు చేసుకోవడం, కుటుంబ సంబంధాలను సెట్ చేయడంలో చాలా అలసిపోయి శృంగారం పట్ల ఆసక్తి తగ్గడానికి దోహదం చేస్తుంది.

ఇది చాలా సహజమైనది మరియు తాత్కాలికమైనది కూడా. మీ భర్త తో మాట్లాడండి.. త‌ల్లి బిడ్డ‌ను చూసుకుని ఎంత‌గానో మురిసిపోతుంది. ఇంతటి ఆనందాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడంలో ఇద్దరూ సమానంగా బాధ్యత వహిస్తారు. అంటే భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ఒక్కటే. కాబట్టి ఇద్దరూ ఒకటే లాగానే వ్యవహరించాలి. బేబీ పుట్టిన తర్వాత ఆందోళనలు, భయాలు మరియు సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం గురించి ఇద్ద‌రూ ఒక‌రికొకరు షేర్ చేసుకోవాలి.

పడక గది బయట కొంత ఆనందాన్ని కలిగించే మార్గాలను వెతుక్కోవ‌డం. అది ఒత్తిడి, ఆందోళనలను మరియు అలసటను తగ్గిస్తుంది. చిన్న పిల్ల‌లుగా ఉన్న‌ప్పుడు వారికి ప్ర‌తిదీ త‌ల్లే ద‌గ్గ‌రుండి చూసుకోవ‌ల‌సి వ‌స్తుంది. అలాంట‌ప్పుడు త‌ల్లికి స‌మ‌యం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. దీంతో భర్త ని నిర్లక్ష్యం చేయటం ప్రారంభించమని కాదు. కానీ చాలా మందిలో ఈ అపోహ‌లు అనేవి వ‌చ్చి కొన్నిసార్లు భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌ల‌కు దారితీస్తుంది. ఒక తండ్రిగా అతను చాలా శ్రద్ధ తీసుకుంటారు.

కానీ అతనికి కొన్ని సార్లు భార్య అవసరం అవుతుంది. అది కొంచెం కష్టమే అయినా అసాధ్యం కాదు. అందుకే మీరు మీ పట్ల మరియు మీ భర్త పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాల‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆమె శరీరం చాలా అసౌకర్యానికి గురవుతుంది. – భార్యలు – మీరు కొత్త పాత్రకు అలవాటు పడే సమయంలో మీ భర్తల విషయంలో కూడా కొంచెం ఉదారంగా ఉండండి. మీకు 9 నెలలు సంతోషించే సమయం దొరికింది. కాబట్టి భ‌ర్త‌కు కూడా కొంత స‌మ‌యం కేటాయించాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker