ఈ టీ తాగితే షుగర్ వ్యాధి అస్సలు రాదు, ఈ టీ ఎలా చేసుకోవాలంటే..?
ఆహారం, పానీయాల్లో ఫ్లేవనాయిడ్స్ ఉన్నవాటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రధానంగా బ్లాక్, గ్రీన్ టీ, బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, నారింజ, రెడ్ వైన్, యాపిల్స్, ఎండు ద్రాక్ష, డార్క్ చాక్లెట్ ఉంటాయి. అయితే డార్క్ టీని తాగడం వల్ల డయాబెటీస్ రిస్క్ తగ్గుతుందని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్, చైనాలోని సౌత్ ఈస్ట్ యూనివర్సిటీల పరిశోధనల్లో వెల్లడయ్యింది. మొత్తం 1923 మందిపై ఈ పరిశోధనలు చేశారు.
వీరిలో 436 మంది అప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వారు కాగా, 352 మంది ప్రీ డయాబెటిక్ లక్షణాలతో ఉన్నవారు. మిగిలిన వారంతా రక్తంలో సాధారణ రక్త స్థాయిలు కలవారు. వీరిలో అసలు టీ తాగడం అలవాటు లేని వారూ కొందరున్నారు. వీరు రోజులో ఎన్ని సార్లు టీ తాగుతున్నారు? ఏ రకమైన టీ తాగుతున్నారు? ఏది తాగుతున్నప్పుడు యూరిన్‌లో గ్లూకోజ్ శాతం ఎలా ఉంది? ఇన్సులిన్ విడుదల ఎలా ఉంది? లాంటి అనేక విషయాలను పరిశీలించారు.
అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత డార్క్ టీ తాగే వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయని తేల్చారు. ఏమిటీ డార్క్ టీ.. బ్లాక్‌టీ, డార్క్ టీ ఒకటే అనుకుంటే పొరపాటే. బ్లాక్ టీని మనం అప్పటికప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి, తేయాకు పొడి వేసి తయారు చేసుకుంటాం. అయితే డార్క్ టీ అలా కాదు. దీంట్లో తేయాకులను ఎండలో ఎండబెడతారు.
ఆ ఆకులను నీటిలో వేసి కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు ఫెర్మెంటేషన్ చేస్తారు. అందులో బ్యాక్టీరియా చేరి ఆక్సీకరణం చెందుతుంది. ఆకులు రంగు మారి డార్క్ టీగా మారుతుంది. దీన్ని సాధారణంగా చైనాలో ఎక్కువగా తాగుతూ ఉంటారు. డార్క్ టీ ప్రయోజనాలు.. అస్సలు టీ తాగని వారితో పోలిస్తే ఈ డార్క్ టీ తాగే వారిలో 53శాతం వరకు మధుమేహం రిస్క్ తగ్గినట్లు పరిశోధకులు తేల్చారు.
అలాగే ప్రీ డయాబెటిక్ లక్షణాలు ఉన్న వారిలో 47శాతం మందికి టైప్2 డయాబెటీస్ ప్రమాదం తగ్గుతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ టీలో పంచదార లేదా స్వీటనర్లను వేసుకుంటున్నారా? లేదా? అనే విషయంపైనా ఫలితాలు ఆధారపడి ఉంటాయంటున్నారు. ఒకవేళ టీలో తీపి చేర్చుకుంటున్నట్లయితే మధుమేహం ప్రమాదం పెరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు.