News

పెండ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి.

కరీంనగర్‌ మండలం తీగలగుట్టపల్లికి చెందిన విజయ్‌కుమార్‌ (33) పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురంలోని స్నేహితుడి పెండ్లి విందు వేడుకలో పాల్గొనడానికి ఆదివారం సాయంత్రం వచ్చాడు. అయితే కరీంనగర్‌ మండలం తీగలగుట్టపల్లికి చెందిన విజయ్‌ కుమార్‌ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురంలో జరుగుతోన్న స్నేహితుడి పెళ్లికి ఆదివారం సాయంత్రం హాజరయ్యాడు. పెళ్లి విందు అనంతరం ఇదే మండలంలోని కొలనూర్‌లో విజయ్‌కుమార్‌ మిత్రుడి పెండ్లి బరాత్‌ వద్దకు వెళ్లాడు.

బరాత్‌లో గంటల తరబడి డ్యాన్స్‌ చేశాడు. ఈ క్రమంలో విజయ్‌ కుమార్‌ డ్యాన్స్‌ చేస్తూనే అదే రోజు అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు వెంటనే దవాఖానకు తరలించగా.. మార్గం మధ్యలోనే మరణించాడు. దవఖానాలో విజయ్‌ కుమార్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టు తెలిపారు. విజయ్‌ కుమార్ మృతితో పెళ్లింట విషాద ఛాయలు అలముకున్నాయి. అప్పటివరకు నవ్వుతూ తుళ్లుతూ తమతో ఆనందంగా గడిపిన విజయ్‌ మరణాన్ని అతని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు పొత్కపల్లి ఎస్సై అశోక్‌రెడ్డి తెలిపారు. డీజే అతి ధ్వని కారణంగా గుండెపోటు సంభవిస్తున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ 2019లో హార్వర్డ్ ఎడ్యుకేషన్‌ చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. సంగీతం లేదా ఏదైనా పెద్ద శబ్ధాలు గుండెను ఎలా బలహీనపరుస్తుందో వివరించారు. వీరి అధ్యయనంలో 500 మంది పెద్దల హృదయ స్పందనలను అధ్యయనం చేశారు.

వీరంతా రద్దీగా ఉండే రోడ్ల వద్ద నివసించేవారు. ఇక్కడ వాహనాల శబ్ధాల వల్ల వీరందరికి గుండె వ్యాధులు ఉన్నట్టు గుర్తించారు. ప్రతి 5 డెసిబెల్ పెరుగుదలకు, గుండెపోటు ప్రమాదం 34 శాతం పెరుగుతుందని వెల్లడించారు. ఇది మెదడులోని భావోద్వేగాలకు సంబంధించిన భాగమైన అమిగ్డాలాను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక శబ్దాల వల్ల ఈ భాగం ఎఫెక్ట్ అవుతున్నట్లు పేర్కొన్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker