మీరు రోజు ఇలా వాకింగ్ చేస్తే కేవలం 10 రోజుల్లో తగ్గుతారు.
ప్రతిరోజు వాకింగ్‌కు కొంత సమయం కేటాయించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలంటే కొన్ని నియమాలు పాటిస్తే ఎంతో మంచిది. ఎక్కువ కాలం బతకాలి.. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలి..అంటే కొన్ని నియమాలు పాటించాల్సిందే. ప్రస్తుతమున్న రోజుల్లో ఎంతో మంది ఏదో ఒక అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే బరువు పెరగాలనుకునే వారు తప్పకుండా వ్యాయామం చేయాలి.
అయితే బరువు తగ్గే క్రమంలో చాలా మంది గంటల తరబడి వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున బరువు తగ్గే క్రమంలో మీరు అస్సలు గంటల తరబడి వ్యాయామం చేయకూడదు. ముఖ్యంగా బరువును నియంత్రించే క్రమంలో తప్పకుండా మంచి ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా వ్యాయమం కూడా ఆరోగ్యవతంగా చేయాలి.
అయితే బరువు తగ్గడానికి రెండు ఉత్తమైన వ్యాయామ మార్గాలున్నాయి. అయితే బరువును నియంత్రించుకుని బాడీని ఫిట్ నెస్ చేసుకోవడానికి రోజుకు కనీసం 30 నిమిషాలు తప్పని సరిగా నడవండి. అంతేకాకుండా వారానికి 200 నుంచి 300 నిమిషాల పాటు నడవాలి. ఇలా చేయడం వల్లే మీరు సులభంగా బరువు తగ్గుతారని నిపుణలు అభిప్రాయపడుతున్నారు.
అయితే ప్రతి రోజూ ఉదయం 30 నుంచి 35 నిమిషాల పాటు నడిస్తే మీరు సులభంగా బరువు తగ్గడం ఖాయం. బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజూ వ్యాయామంతో పాటు మంచి ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సాయంత్రం పూట కూడా శరీర ఆకృతిని పొందడానికి శ్రమ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో అధిక మోతాదులో ఉండే క్యాలరీ ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. ఈ డైట్‌ను పాటించడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది.