రోజు యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?
యోగా చేయడం వల్ల శరీరానికి నూతనోత్సాహం కలుగుతుంది. బలాన్ని పెంపొందించుకోవడానికి యోగా సహాయపడుతుంది. యోగా భంగిమను మెరుగుపరుస్తుంది. యోగా కీళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే క్రమం తప్పకుకండా యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. యోగా కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
అలాగే మన శరీర బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. సయాటికా ఉన్నవారు క్రమం తప్పకుండా యోగా చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. యోగా నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నానరు. మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పీఎన్ఏఎస్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ఈ వివరాలను వెల్లడించింది. ఎన్నో వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంతో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోగనిరోధక వ్యవస్థ చాలా చాలా ముఖ్యం. బలమైన రోగనిరోధక వ్యవస్థ ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ప్రతిరోజూ శరీరానికి సరైన నిద్ర, విశ్రాంతి లభించినప్పుడే శరీరం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల నిద్ర సమస్యల నుంచి బయటపడతాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలతో బాధపడే వారికి కూడా యోగా ప్రయోజనకరంగా ఉంటుంది.
యోగా కండరాల నొప్పుల లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. యోగా చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. యోగా చేసేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే విశ్రాంతి తీసుకున్న తర్వాతే యోగా చేయాలి. యోగా చేసేటప్పుడు వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. నేలపై యోగా చాపను పరిచిన తర్వాతే యోగా సాధన చేయాలి.