Health

ఎప్పుడూ తలనొప్పి వస్తోందా..? మీకు ఈ రోగాలు రావొచ్చు, జాగర్త.

తలనొప్పి కి రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని సార్లు పారాసిటమాల్ కూడా పెద్దగా పనిచెయ్యదు. ఉదయం లేచేసరికే తలనొప్పి ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి. వీటిలో చాలా వరకు అంత పెద్ద సమస్యలేమీ కాదు. అయితే తలనొప్పి అనేది మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలలో ఒకటిగా మారిపోయింది. నిజానికి తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. కారణాలలో వ్యత్యాసాన్ని బట్టి తలనొప్పి తీవ్రత, కాలపరిమితి, నొప్పి అనుభవించే ప్రదేశం అన్నీ మారే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

టెన్షన్ వల్ల కలిగే తలనొప్పి, మైగ్రేన్లు, క్లస్టర్ తలనొప్పి , సైనస్ తలనొప్పి సాధారణంగా కనిపించే కొన్ని రకాల తలనొప్పులు. వీటన్నింటి లక్షణాలు భిన్నంగా ఉంటాయి. అయితే తలనొప్పి తరచూ వస్తుంటే టెస్టులు చేయించుకుని కారణాన్ని తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే తలనొప్పి వెనుక సాధారణ కారకాలతో పాటు తీవ్రమైన అనారోగ్య సమస్య కూడా ఉండొచ్చు. ఒత్తిడి.. వీటిలో ఒకటి ఒత్తిడి కూడా. అవును ఒత్తిడి, యాంగ్జైటీ వల్ల కూడా తరచుగా తలనొప్పి వస్తుంది.

దీన్ని టెన్షన్ తలనొప్పి అంటారు. ఇది మన నిద్ర, ఆహారం ఇలా ప్రతిదాన్ని ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి.. నిద్రలేమి కూడా తలనొప్పికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే తలనొప్పి కూడా నిద్రలేమికి దారితీస్తుంది. అంటే నిద్ర, తలనొప్పి ఒకదానికొకటి చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటాయి. డీహైడ్రేషన్ .. శరీరం నిర్జలీకరణానికి గురవ్వడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ప్రతిరోజూ తగినంత నీటిని తాగితే ఈ రకమైన తలనొప్పిని నివారించవచ్చు. అలాగే తగ్గించుకోవచ్చు.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు .. నేడు చాలా మంది స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఫోన్ వాడిన తర్వాత ల్యాప్ టాప్, కంప్యూటర్ స్క్రీన్లను చూసే అలవాటు కూడా చాలా మందికి ఉంటుంది. కంటిపై దీర్ఘకాలిక ఒత్తిడి కూడా తలనొప్పికి దారితీస్తుంది. ఈ తలనొప్పి రాకుండా ఉండాలంటే స్క్రీన్ టైమ్ ను తగ్గించాల్సి ఉంటుంది. సైనస్.. సైనస్ సంబంధిత సమస్యల వల్ల కూడా తలనొప్పి వస్తుందని నిపుణులు అంటుననారు.

సైనస్ సమస్యలో భాగంగా అప్పుడప్పుడు తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. హార్మోన్ల మార్పులు.. హార్మోన్ల మార్పుల వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ముఖ్యంగా మహిళల్లో. నెలసరికి సంబంధించిన హార్మోన్ల మార్పులు తలనొప్పికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. కాఫీ.. రెగ్యలర్ టైం కి కాఫీ తీసుకోకపోతే తలనొప్పి వచ్చేవారిని మీరు చూసేఉంటారు. దీనికి కారణం కాఫీలో కెఫిన్. ఈ వ్యసనం వల్ల తలనొప్పి వస్తుంది. కెఫిన్ సాధారణ మోతాదును పొందనప్పుడు తలనొప్పి వస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker