Health

రోజుకి రెండు క‌ప్పులు టీ తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసుకోండి.

టీ శరీరాన్ని ఒత్తిడిని నుంచి తొలగించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనిని మధ్యాహ్నం పూట తాగితే అద్భుతమైన తాజాదనాన్ని ఇవ్వడంతోపాటు అలసట దూరం చేస్తుంది. అయితే ప్రతిరోజూ రెండు కప్పుల కంటే ఎక్కువ టీ తాగ‌ని వారి కంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం తెలిపింది.అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో జరిగిన ఈ అధ్యయనం టీ తాగని వారితో పోలిస్తే, ప్రతి రోజు రెండు లేదా అంతకంటే ఎక్కువ కప్పులు తాగే వారిల మరణాల ప్రమాదం 9 నుండి 13 శాతం తక్కువగా ఉందని తేలింది.

USలోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (NCI)కి చెందిన మాకి ఇనౌ-చోయ్‌తో సహా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, టీ, ఎక్కువ స్థాయిలో తీసుకోవ‌డం అనేది మ‌నం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవ‌డంలో ఒక‌ భాగమ‌ని అభిప్రాప‌డ్డారు.అయితే టీ అనేది ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువగా తాగే పానీయాల్లో ఒక‌ట‌ని ఈ అద్య‌య‌నం చెబుతుంది. ఇదిలా ఉంటే గ‌తంలో గ్రీన్ టీ తాగ‌డం వ‌ల‌్ల మ‌న జీవ‌న ప్ర‌మాణాన్ని పెంచుకోవ‌చ్చ‌ని ఒక అధ్య‌య‌నం తెలిపింది అయితే ఇప్పుడు గ్రీన్ టీ కాకుండా సాదార‌ణం టీ కూడా రోజుకు రెండు క‌ప్పులు తీసుకుంటే మ‌న ఆరోగ్యం ప‌దిలంగ ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశోధ‌కులు.

దీంతోపాటు బ్లాక్ టీ తాగడం కూడా మ‌నిషి ఆరోగ్యాన్ని మెరుగుప‌ర్చుతుంద‌ని అంటున్నారు ప‌రిశోధ‌కులు ముఖ్యంగా ఈ టీల‌పై పరిశోధన బృందం UK బయోబ్యాంక్ నుండి డేటాను సేక‌రించి అన్ని-కారణాలు తోపాటు నిర్దిష్ట మరణాలతో టీ వినియోగం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని ఈ స‌ర్వే చేసింది. సాధారణ టీ అంటే పాలు పంచ‌దార‌తో చేసే టీ దాన్ని ఉష్ణోగ్రత అందులో ఉండే కెఫిన్‌ను మ‌నిషి జీవక్రియ రేటును పెంచుతుంద‌ని చెబుతున్నారు ప‌రిశోధ‌క‌లు.

UK బయోబ్యాంక్ 2006, 2010 మధ్య 40 నుండి 69 సంవత్సరాల వయస్సు గల సుమారు అర మిలియన్ మంది పురుషులు మహిళల్లో టీ తాగిన త‌రువాత క‌లిగిన ప‌రిణామాల‌ను అధ్య‌య‌నం చేసి ఈ స‌ర్వేను విడుద‌ల చేసింది. ఈ స‌ర్వేలో పాల్గోన్న వారిలో 85 శాతం మంది రెగ్యులర్‌గా టీ తాగుతున్నారని, వారిలో 89 శాతం మంది బ్లాక్ టీ తాగుతున్నారని పేర్కొన్నారు. ఇందులో పాల్గొనేవారిలో చాలా మంది కాఫీ తాగారా, వారు తాగే టీలో పాలు చ‌క్కెర వంటివి యాడ్ చేసుకుంటారా? టీ ఎంత వేడిగా ఉంటే ఇష్ణ‌ప‌డ‌తారు మొద‌లుగు ప్ర‌శ్న‌ల‌కు స‌మాదానాలు చెప్పారు. మొత్తానికి రోజుకి రెండు కప్పుల టీ అనేది మ‌న లైప్ టైమ్ ను పెంచుతుంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ వార్త ఇప్పుడు చాయ్ ప్రియుల‌కు భ‌లే కిక్కిస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker