Health

రోజుకు మూడు కప్పులు ఛాయ్‌ తాగే వారికీ గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు.

సీజన్ ఏదైనా, సమయం ఏదైనా కడుపులో ఒక గ్లాస్ వేడి టీ పడితే వారికి వచ్చే ఎనర్జే వేరు. ఇలా ప్రతీ బ్రేక్‌లో టీ తాగుతారు, టీ కోసమే బ్రేక్ తీసుకుంటారు, బ్రేక్ లేకుండా టీ తాగేస్తుంటారు. టీ ఆకులలో సహజంగా కెఫిన్ ఉంటుంది. ఈ కెఫిన్‌ను ఎక్కువగా తీసుకోవడం ఒత్తిడి, ఆందోళనలతో పాటు అవిశ్రాంతికర భావాలకు దోహదం చేస్తుంది. అయితే పొద్దున లేవగానే కచ్చితంగా ‘టీ’ పడాలి చాలామందికి. టిఫిన్‌ తిన్న తర్వాత ఒకసారి, ఇక ఆ తర్వాత సాయంత్రం మరోసారి టీ ఉండాల్సిందే.

ఇక ఇప్పుడు రకరకాల ఛాయ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటిల్లో గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ, ఛాయ్‌ ఒంటికి మంచిదని చెప్తున్నారు సైంటిస్టులు. టీ యాంటీ ఏజింగ్‌కి ఉపయోగపడుతుందని చైనాకి చెందిన రిసెర్చ్‌ టీమ్‌ వెల్లడించింది. గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీలో ఉండే హెల్తీ కెమికల్స్‌ కొన్ని శరీరంలోని సెల్స్‌ కొన్ని పాడవ్వకుండా చేసి, ఏజింగ్‌పై ప్రభావం చూపిస్తాయని, అవయవాలన్నీ సరిగ్గా పనిచేసేందుకు కూడా ఉపయోగపడతాయని చెప్పారు. ‘టీ’లో చాలా బయోయాక్టివ్‌ కాంపౌండ్స్‌ ఉంటాయని, దానివల్ల యాంటీ ఏజింగ్‌ బెనిఫిట్స్‌ ఎక్కువగా ఉన్నట్లు గమనించామని సియాచిన్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ యిగ్జియాంగ్‌ చెప్పారు.

అంతేకాకుండా టీ తాగడం వల్ల డయాబెటిస్‌, గుండె సంబంధిత వ్యాధులు కూడా రావని గతంలో చాలా అధ్యాయనాల్లో తేలిందని ఆమె చెప్పారు. టీలో ఉండే పాలిఫెనాల్స్‌, పవర్‌ఫుల్‌ యాంటిఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ రాకుండా, చిత్త వైకల్యం రాకుండా కాపాడతాయని చెప్పారు. బ్రిటన్‌కి చెందిన 37 – 73 ఏళ్ల వయసు ఉన్న 5,998 మంది, చైనాకు చెందిన 7,931 మందిపైన ఈ రిసెర్చ్‌ చేశామని సైంటిస్టులు చెప్పారు. గ్రీన్‌ టీ, ఒలాంగో టీ, బ్లాక్‌ టీ తాగేవాళ్లుపై ఈ రిసెర్చ్‌ చేసి రిపోర్ట్‌లు ఇచ్చామన్నారు.

టీ ఉండే పాలిఫెనాల్స్‌ గట్‌ మైక్రోబయోటాను మాడ్యులేట్‌ చేస్తాయని, ఇది ఇమ్యూనిటీని, జీవక్రియ పనితీరును మెరుగుపరిచి, వయసు సంబంధిత మార్పులపై ప్రభావం చూపిస్తుందని యిగ్జియాంగ్ చెప్పారు. వాటితో పాటుగా.. ఉండే కెఫైన్‌,తియనైన్‌ అనే బయో యాక్టివ్‌ కాంపౌండ్స్‌ కూడా అందాన్ని పెంచుతాయి. రోజు టీ తాగడం వల్ల.. ఒక వ్యక్తి అందం సగటున రెండేళ్ల వయసుకు తగ్గుతుందని రిసెర్చ్‌లో తేలినట్లు సైంటిస్టులు చెప్పారు. యావరేజ్‌గ రోజుకి మూడు కప్పులు తాగేవాళ్లలో ఈ మార్పు కచ్చితంగా కనిపిస్తుందని అన్నారు.

అయితే, మోతాదుకు మించి తీసుకునేది ఏదైనా కచ్చితంగా హాని కలిగిస్తుందని, ఆ విషయాన్ని కూడా గమనించాలని హెచ్చరిస్తున్నారు కూడా. ఇంకేముంది.. టీ తాగేద్దాం అందం పెంచుకుందామని ఓ టీ ఎక్కువగా కూడా తొగొద్దు. దైన్నైనా కావాల్సినంత, అవసరమైనంత మాత్రనే తీసుకుంటే మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker