రోజూ ఓ గ్లాస్ మజ్జిగ తాగితే ఈ రోగాలు మిమ్మల్ని ఏం చేయలేవు.
ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు మజ్జిగ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా వేసవి సీజన్‌లో వేడిని తట్టుకోవడానికి మజ్జిగ ఎక్కువ తాగుతారు. మజ్జిగను పెరుగు, కొన్ని మసాల పోపు దినుసులతో రుచికరంగా తయారుచేసుకుంటారు. అయితే వేడిని ఎలా తట్టుకోవాలి అంటే దానికి పరిష్కారం ఒకటే.
అదే చల్లచల్లని మజ్జిగ. అవును.. రోజూ ఓ గ్లాస్ చల్ల చల్లని మజ్జిగ తాగితే ఎండాకాలం ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మజ్జిగలో నిమ్మరసం కలుపుకొని తాగితే ఎండదెబ్బ తాకే ప్రమాదం ఉండదు. దాంతో పాటు వేసవి తాపం కూడా తీరుతుంది. డీహైడ్రేషన్ కాకుండా ఉంటారు.
మజ్జిగలో ప్రొటీన్స్, మినరల్స్ లాంటి ఖనిజాలు ఉంటాయి. అవి చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అంతే కాదు.. కాల్షియం లోపంతో బాధ పడేవాళ్లు మజ్జిగను తాగితే వాళ్ల ఎముకలు, దంతాలు కూడా దృఢపడతాయి. రోజూ మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
గ్యాస్, అజీర్తి సమస్యలతో బాధపడేవాళ్లు కూడా మజ్జిగను రోజూ తాగొచ్చు. ఎండాకాలం చాలామందికి వేడి చేస్తుంది. ఆ వేడిని తగ్గించుకోవడానికి కూడా మజ్జిగను తాగొచ్చు. అందుకే.. మిట్టమధ్యాహ్నం వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మజ్జిగ తాగితే కడుపు చల్లగా ఉంటుంది.