రోజూ 90 ML మద్యం తాగుతున్నారా..? ఈ షాకింగ్ విషయాలు మీ కోసమే.
శరీరంలో ఆల్కహాల్ అనేక రకాల ప్రభావాలను చూపిస్తుంది. అలాగే మెదడులో డోపమైన్ అనే మోలిక్యుల్‌ను విడుదల చేస్తుంది. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా మద్యం సేవిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చాలా తక్కువ వ్యవధిలోనే మహిళలపై ఆల్కహాల్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే మద్యం సేవిస్తే మంచిదే కదా అని కూడా కొందరు అంటుంటారు. ఇక కొందరు మనస్సు బాగా లేదనో, ఒత్తిడి ఎక్కువగా ఉందనో, ఇతరత్రా సమస్యలు ఉన్నాయనో చెప్పి రోజూ మద్యం సేవిస్తుంటారు.
అయితే వాస్తవానికి మద్యాన్ని ఎప్పుడో ఒకసారి ఒకటి లేదా రెండు పెగ్గులు సేవిస్తే మంచిదే అని వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ దాన్ని రోజూ వ్యసనంగా తీసుకుంటుంటే మాత్రం అది ఆరోగ్యానికి ఎంతో కీడును కలిగిస్తుందని అంటున్నారు. చాలా మంది 90 ఎంఎల్ అని చెప్పి రోజూ మద్యం సేవిస్తుంటారు. అయితే అంత తక్కువ మోతాదులో అయినా సరే ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు. కానీ రోజూ అయితే మాత్రం దుష్పరిణామాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజూ మద్యం సేవించడం వల్ల శరీరంపై ఒత్తిడి పడుతుంది. అది మానసికంగా కూడా ప్రభావం చూపిస్తుంది. మద్యం రోజూ సేవించడం వల్ల మెదడు కణాలు దెబ్బ తింటాయి. దీంతో మానసికంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. విసుగు, కోపం, చికాకు వంటివి వస్తాయి. ఎవరు చెప్పినా వినరు. మద్యానికి బానిసలుగా మారిపోతారు. అందుకోసం ఏం చేసేందుకైనా వెనుకాడరు. కనుక మద్యం రోజూ సేవించడం మానుకోవాలి.
రోజూ మందు తాగడం వల్ల లివర్‌కు ఎంతగానో నష్టం కలుగుతుంది. కిడ్నీలు చెడిపోతాయి. దీంతో ప్రాణాల మీదకు వస్తుంది. అప్పుడు చేసేదేమీ ఉండదు. అలాగే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. డయాబెటిస్, గుండె జబ్బులు వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. ఆహారం సరిగ్గా తినలేరు. తిన్నా వంటబట్టదు. శరీరం అంతా విషతుల్యంగా మారుతుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి.
దీంతో ప్రాణాల మీదకు వస్తుంది. రోజూ మద్యం సేవిస్తే కొంత కాలానికి చిన్నపాటి ధ్వనులను కూడా గుర్తించలేరు. వాసనశక్తి తగ్గిపోతుంది. చూపు స్పష్టంగా ఉండదు. శరీరం వణికినట్లు అవుతుంది. ఇన్ని అనర్థాలు పొంచి ఉంటాయి కనుక మద్యాన్ని రోజూ తాగరాదు. ఎప్పుడో ఒకసారి ఒకటి లేదా రెండు పెగ్గులు అయితే ఓకే. కానీ రోజూ సేవిస్తే అనవసరంగా ప్రాణాలను పోగొట్టుకున్నవారు అవుతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.