రోజూ 5 నిమిషాలు ఈ శ్వాస వ్యాయామాలు చేస్తే జీవితంలో ఎలాంటి రోగాల బారిన పడరు.
చాలా మంది ప్రస్తుతం శ్వాస తీసుకోవడం వంటి సమస్యలతో త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి గాఢంగా ఊపిరి పీల్చుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యానికి చాలా మేలు జరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మీకు బయటకు వెళ్లి వ్యాయామం చేసేంత సమయం లేకపోతే ఇంట్లో ఉండి కూడా మీ ఫిట్‌నెస్ ని కాపాడుకోవచ్చు. మీరు ఫిట్‌గా ఉండటానికి ఇంట్లోనే శ్వాస వ్యాయామాలు చేయవచ్చు. ఇందుకు ఎక్కువ సమయం కూడా అవసరం లేదు.
ప్రతిరోజూ కేవలం 2-5 నిమిషాల పాటు శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా మీ శరీరాన్ని కూడా మీ మనసును ఫిట్‌గా ఉంచుకోవచ్చు. నెమ్మదిగా మీ సౌకర్యాన్ని బట్టి వ్యాయామ సమయాన్ని పొడగించుకోవచ్చు. లేదా మీకు సమయం దొరికినపుడే రోజులో రెండు సార్లు కొన్ని నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.. శ్వాస వ్యాయామాలు చేసేటపుడు మీరు లోతైన శ్వాస తీసుకున్నప్పుడు, డయాఫ్రాగమ్ పైకి , క్రిందికి కదలిక జరుగుతుంది. తద్వారా వివిధ శరీర భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ రకంగా అవయవాలు పనితీరు కూడా పెరుగుంది.
శరీరం నుండి విషాన్ని తొలగించడంలోనూ ఇది సహాయపడుతుంది. మెరుగైన ఆక్సిజన్ రవాణా.. రక్తప్రసరణ మెరుగుపడటం వలన అన్ని భాగాలకు ఆక్సిజన్ చేరుతుంది. మనకు ఆక్సిజన్ ఎంత ముఖ్యమో తెలిసిందే. ఆక్సిజన్ ను ప్రాణవాయువు అంటారు. ఆక్సిజన్ తగినంతగా లేకపోతే, మన సిస్టమ్‌లో కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది. ఇది విషంలా పని చేస్తుంది తద్వారా మనకు అలసట, మగత, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. శ్వాసకోశ సమస్య ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
అయితే శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా శ్వాసకోశ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకోగలుగుతాము. ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి.. శ్వాస వ్యాయామాలు మనం ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి, మన మనస్సును ప్రశాంతపరుస్తాయి. ఈ రకంగా ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో ఇవి అత్యంత ప్రభావవంతమైనవిగా నిరూపితమయ్యాయి. హృదయ ఆరోగ్యం.. క్రమం తప్పకుండా బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం వల్ల మన రక్తపోటు స్థాయిలు మెయింటైన్ చేయడానికి సహయపడతాయి.
హైపర్ టెన్షన్ ఉన్న రోగులకు శ్వాస వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. ఇది స్ట్రోక్, గుండె జబ్బుల సంభావ్యతను తగ్గిస్తుంది. ముఖంలో ప్రకాశం..ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి, ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి అని ఇది వరకే చెప్పుకున్నాం. ఈ రెండూ కూడా చర్మ ఆరోగ్యానికి కీలకం. రక్తం నిర్విషీకరణ జరగటం వలన చర్మం యవ్వనంగా, మెరుస్తూ ఉంటుంది. ఫలితంగా ముఖంలో మంచి ప్రకాశం వస్తుంది.