Health

దగ్గు సిరప్ తాగిన 2 ఏళ్ల చిన్నారి గుండె ఆగిపోయింది. వైద్యులు ఏం చెప్పారంటే..?

ముంబైకి చెందిన పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డా.డిలు మంగేష్కర్ రెండున్నరేళ్ల మనవడు డిసెంబర్ 15న దగ్గు, జలుబుతో బాధపడ్డాడు. అందుకు చిన్నారికి దగ్గు మందు ఇచ్చారు. అయితే మందు ఇచ్చిన 20 నిమిషాల తర్వాత చిన్నారి ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. ఆపై ఊపిరి పీల్చుకోలేక ప్రాణాలు కోల్పోయింది. అయితే ముంబైకి చెందిన పెయిన్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్ డా. దిలు మంగేష్కర్ రెండున్నరేళ్ల మనవడు డిసెంబర్ 15న దగ్గు, జలుబుతో బాధపడ్డాడు. దాంతో అతని తల్లి చిన్నారికి ఒక బహుళజాతి కంపెనీకి చెందిన దగ్గు మందు ఇచ్చింది.

అయితే మందు ఇచ్చిన 20 నిమిషాల తర్వాత చిన్నారి ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. ఆ తర్వాత అతని గుండె చప్పుడు ఆగిపోయింది. దీంతో పాటు చిన్నారి ఊపిరి పీల్చుకోలేకపోయింది. సుమారు 20 నిమిషాల పాటు ఆ శిశువుకు పల్స్ లేదు. దాంతో ఆ చిన్నారి తల్లి వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ బిడ్డకు హుటాహుటినా CPR అందించబడింది. ఆ తర్వాత పాప కళ్లు తెరిచి రక్తపోటు, గుండె వేగం పెరగడానికి దాదాపు 20 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై చిన్నారి తల్లి మాట్లాడుతూ.. ఘటన జరిగిన తర్వాత పలురకాల టెస్టులు చేశారు.

ఇందుకు కారణం దగ్గుకు వాడిన మందు తప్ప మరే కారణం కనిపించలేదని వైద్యులు చెప్పారు. ఈ డ్రగ్‌లో క్లోర్‌ఫెనిరమైన్‌, డెక్స్‌ట్రోమెథార్ఫాన్‌ సమ్మేళనాలు ఉన్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలిందని , నాలుగేళ్లలోపు ఈ మందులను పిల్లలకు ఇవ్వకుండా ఎఫ్‌డీఏ నిషేధించిందని తెలిపారు . అయితే, ఈ ఔషధానికి అలాంటి లేబుల్ లేదు. వైద్యులు దీనిని వారి రోగులకు సూచిస్తారు. మరోవైపు దగ్గు సిరప్ కార్డియాక్ అరెస్ట్‌కు కారణమైందని నిరూపించడం అంత సులభం కాదంటున్నారు వైద్యులు.

ఈ ఘటనపై సీనియర్ పీడియాట్రిక్ నిపుణుడు వ్యాఖ్యానిస్తూ, పిల్లల మూర్ఛకు, దగ్గు మందు మోతాదుకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచడం అంత సులభం కాదని అన్నారు. మహారాష్ట్రలోని చిల్డ్రన్స్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా ఉన్న డాక్టర్ విజయ్ యెవాలే మాట్లాడుతూ, తాను నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు మందులను సూచించలేదని చెప్పారు. చాలా సందర్భాలలో దగ్గు సిరప్ అవసరం లేదని డాక్టర్ తెలిపారు. ఉదాహరణకు, ముక్కు కారటం, దగ్గును వెచ్చని కంప్రెస్తో చికిత్స చేయవచ్చు. కొన్ని దగ్గు సిరప్‌లకు గుండె సమస్యలతో సంబంధం ఉన్నట్లు కొత్త ఆధారాలు కనుగొనబడ్డాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker