బిర్యానీల్లో వేసే దగడపువ్వు ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా అశ్చ్యర్యపోతారు.
దగడపువ్వునే కల్పసి అని కూడా పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో. బిర్యానీలు, మాంసాహార వంటల్లో దీన్ని కచ్చితంగా వినియోగిస్తారు. చెట్టినాడ్ వంటల్లో కచ్చితంగా వాడే పదార్థం ఇది. దీన్ని ముక్కుతో వాసన పీల్చడం వల్ల మీకు దాని ఫ్లేవర్ తెలియదు. కానీ వంటల్లో కలిపి వండితే రుచి రెట్టింపు అవుతుంవది. ఇది వేడికే ప్రతిస్పందిస్తుంది. వేడి పదార్థానికి జతచేరినప్పుడు సువాసనను ఉత్పత్తి చేస్తుంది.
అయితే బిర్యానీలు, మాంసాహార వంటల్లో దీన్ని కచ్చితంగా వేస్తారు…చెట్టినాడ్ వంటల్లో అయితే కచ్చితంగా వాడే పదార్థం ఇది. దీన్ని ముక్కుతో వాసన పీల్చడం వల్ల మీకు దాని ఫ్లేవర్ తెలియదు. కానీ వంటల్లో కలిపి వండితే మాత్రం రుచి రెట్టింపు అవుతుంవది. ఇది వేడికే ప్రతిస్పందిస్తుంది. వేడి పదార్థానికి జతచేరినప్పుడు అందులోంచి మంచి సువాసన వస్తుంది. ముఖ్యంగా వేడి నూనె లేదా నెయ్యిలో వేసినప్పుడు ఘుమఘమలాడుతుంది.
ఇది ఆహారానికి ప్రత్యేకమైన స్మోకీ సువాసనను అందిస్తుంది. కొన్నిసార్లు మట్టి వాసనను కూడా అందిస్తుంది. తినడం వల్ల లాభాలు.. లైకెన్ లేదా దగడపువ్వు ఎలా పిలుచుకున్నా ఇది మన శరీరానికి మేలే చేస్తుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. ఇది యాంటీ-వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుందని చెబుతారు పోషకాహార నిపుణులు. ఇది ఇంగగువ, అజినమోటోలానే రుచి కోసం వాడతారు.
ఆహారం మెరుగ్గా జీర్ణం అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరానికి తగిలిన దెబ్బలను త్వరగా నయమయ్యేలా చేసే లక్షణాలు దీనిలో ఉన్నాయి. కాలేయం, పొట్ట, గర్భాశయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. పొట్టలో అధికంగా గ్యాస్ ఏర్పడటాన్ని అడ్డుకుంటుంది. మంచిది కదా అని అన్ని వంటల్లో వాడకూడదు.. కేవలం బిర్యానీ, మసాలా వంటల్లోనే అది కూడా కొద్దిగా మాత్రమే వేయాలి..!