పెరుగులో బెల్లం కలిపి తింటే..! ఈ జబ్బులకు మందు అవసరం లేదు..!
పెరుగు, బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత క్యాల్షియం లభిస్తుంది. దంతాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా పెరుగును, బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అయితే నిజానికి పెరుగుతో బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బెల్లం, పెరుగులో చాలా పోషకాలను కలిగి ఉంటాయి. అంటే రక్తహీనత సమస్య ఉన్నట్లయితే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యానికి అవసరమైన అనేక వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడుతుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్‌ని కలిగి ఉంటుంది. రక్తహీనతను నివారిస్తుంది:- శరీరంలో రక్తహీనతతో బాధపడేవారు పెరుగు , బెల్లం కలిపి రోజూ తింటే శరీరంలో రక్తం పెరిగి రక్తహీనత సమస్య దూరమవుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:- జీర్ణవ్యవస్థ సరిగా పని చేయనప్పుడు మలబద్ధకం, కడుపు ఉబ్బరం, వాంతులు వంటి సమస్యలు సర్వసాధారణం. పెరుగు, బెల్లం రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది:- మీరు బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతున్నట్టయితే, మీ రోజువారీ ఆహారంలో పెరుగు, బెల్లం కలుపుకుని తినటం మంచిది.
పెరుగు, బెల్లం తినడం వల్ల మీ కడుపు గంటల తరబడి నిండుగా ఉంటుంది. ఇది సులభంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:- మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే, మీరు తరచుగా అనారోగ్యంతో బాధపడుతుంటే, మీరు పెరుగు, బెల్లం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధులను నివారిస్తుంది.