Health

రోజుకు ఎన్ని కిస్మిస్‌ల‌ను తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకోండి.

తరుచూ ఎండుద్రాక్ష తింటే రక్తపోటు(బీపీ), మధుమేహం(షుగర్) అదుపులో ఉంటాయి. ఆకలి వేసినప్పుడు స్నాక్స్ కంటే వీటిని తినడం మేలు. ఎండుద్రాక్షలోని పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, డయేరియాని నివారిస్తుంది. అయితే రుచికి తియ్యగా, కాస్త పుల్లగా ఉండే కిస్మిస్ (ఎండు ద్రాక్ష)ల వాడకం ఆరోగ్యానికి ఎంతో మంచిది. సాధారణంగా పాయసంలో జీడిపప్పు, బాదంపప్పులతోపాటు కిస్మిస్‌లను కూడా వేస్తారు.

వీటిని చూడగానే పాయసం తాగాలనిపిస్తుంది. కిస్మిస్‌లు వేయడం వల్ల పాయసానికి మంచి రుచి కూడా వస్తుంది. లడ్డూలలో తప్పకుండా కిస్మిస్‌లు వేస్తారు. అయితే ఇవి కేవలం రుచినే కాదు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. వీటిని రోజూ తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా వీటిని రోజుకు 8 నుంచి 10 చొప్పున తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. కిస్మిస్‌లలో పొటాషియం, మెగ్నిషియం ఉంటాయి. వీటిని తినడం వల్ల అసిడిటీ రాదు.

కిస్మిస్‌లలో కాల్షియం ఉండడం వల్ల దంతాలకు, ఎముకలకు మంచిది. వాటిలో ఉండే బోరాన్ అనే ఖనిజం మూలంగా ఎముకలకు సంబంధించిన ఆస్టియో పోరోసిస్‌ను రాకుండా చూసుకోవచ్చు. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. కిస్మిస్‌లలో రాగి, ఇనుము, విటమిన్ బి 12 కూడా ఉంటాయి. కాబట్టి అనీమియా ఉన్నవారు వీటిని తింటే రక్తహీనత తగ్గుతుంది. త్వరగా గాయాలు నయం అవుతాయి. కిస్మిస్‌లలో పాలిఫినాలిక్ ఫైటో పోషకాలుంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి.

బాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా చూస్తాయి. కంటి రోగాల నుంచి రక్షణనిస్తాయి. కిస్మిస్ పండ్లను తినడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఒంట్లో నీరసం తగ్గుతుంది. ఉత్సాహంగా ఉంటారు. కిస్మిస్‌లను తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ లు రావు. ఇలా కిస్మిస్‌ల‌ను రోజూ 8 నుంచి 10 చొప్పున తింటే చాలు.. ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker