Health

చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోండి.

ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే కాళ్లు తిమ్మిరెక్కుతాయి. అలాగే అరికాలు, అరచేతిలో కూడా తిమ్మిర్లు వస్తుంటాయి. ఇది అందరినీ ఏదో ఓ సందర్భంలో ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అయితే, ఇలాంటి ఇబ్బంది అప్పుడప్పుడు జరిగితే పెద్ద నష్టం లేదు. కానీ, తరచుగా జరుగుతుంటే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందే అంటున్నారు వైద్యులు. అయితే మనకు అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తుంటాయి. కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కినట్లు అనిపిస్తుంటాయి.

ఎక్కువ సేపు అలాగే ఉంచితే తిమ్మిర్లు రావడం సహజమే. కానీ తిమ్మిర్ల వెనుక అనారోగ్య సమస్యలు కూడా దాగి ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. ఒకే చోట ఎక్కువ కదలకుండా కూర్చున్నప్పుడు నరాలు ఒత్తిడికి గురై తిమ్మిర్లు వస్తుంటాయి. అరికాళ్లు, అరచేతులకు కూడా తిమ్మిర్లు అనిపిస్తాయి. తరచుగా తిమ్మిర్లు ఎక్కితే ఆలోచించాల్సిందే. వైద్యులను కలవాల్సిందే. పరీక్షలు నిర్వహించుకుని చికిత్స తీసుకోవాల్సిందే. తిమ్మిర్లు అదే పనిగా వస్తుంటే అనారోగ్య సమస్యలు వచ్చినట్లు గుర్తించాలి.

తిమ్మిర్లు వారాల తరబడి వేధిస్తుంటే పలు రకాల వ్యాధులకు సంకేతంగా బావించుకోవాలి. రక్తంలో అధిక చక్కెర కారణంగా నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాళ్లు, చేతులు తిమ్మిరికి గురవుతుంటే వైద్య చికిత్సలు తీసుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాని నిర్లక్ష్యం చేస్తే ఇతర జబ్బులకు కూడా కారణంగా నిలుస్తుంది. వెన్నెముకలో జారిన డిస్క్ కాళ్ల కిందకు వెళ్లే నరాల ఒత్తిడి కలిగించి తిమ్మిర్లకు కారణంగా నిలుస్తుంది. ల్యూపస్, రుమలాయిడ్, అర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల వల్ల తిమ్మిర్లు రావడం సహజం.

మనం తీసుకునే ఆహారంలో ిటమిన్ బి, విటమిన్ ఈ లోపం వల్ల కూా తిమ్మిర్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇంకా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడే వారికి కూడా తిమ్మిర్లు వచ్చే అవకాశాలుంటాయి. హెపటైటిస్ బి, సి, టైమ్ డిసీజ్ వంటి వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు నరాలను దెబ్బతీస్తుంటాయి. దీంతో కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి. మూత్రపిండాలు సక్రమంగా పనిచేయకపోయినా తిమ్మిర్లు రావడం చూస్తుంటాం. థైరాయిడ్ సమస్యలు ఉన్న వారికి కూడా తిమ్మిర్లు ఏర్పడతాయి.

జన్యుపరమైన రుగ్మతల వల్ల కూడా కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు అనిపిస్తాయి. అతిగా మద్యం తాగే వారికి కూడా తిమ్మిర్లు ఇబ్బందులు కలిగిస్తాయి. మొత్తానికి తిమ్మిర్లు ఏర్పడినప్పుడు ఏమరుపాటుగా ఉండకుండా వైద్య చికిత్సలు తీసుకుని సమస్యను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. తిమ్మిర్లు వచ్చినప్పుడు సరైన చికిత్స తీసుకోవాలి. తిమ్మిర్లు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుని మందులు వాడుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker