ఈ ఇంటి చిట్కాలతో కరోనా కొత్త వేరియంట్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
చైనాలో బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ కొత్త వేరియంట్ కారణంగా ఆ దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. భారత్ లోకి బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించింది. దేశంలో కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్ లో, ఒడిశాలో నమోదు అయ్యాయి.
అయితే భారత్‌లోని కరోనా కొత్త వేరియంట్ ప్రవేశించింది. కరోనా ఆపత్కాల సమయంలో చాలామంది ప్రజలు మూలికలతో తయారు చేసిన కషాయాలను తీసుకోవడం ప్రారంభించారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఇవి ఉత్తమ మార్గం. అదే సమయంలో వీటిని పరిమితంగా తీసుకోవడం కూడా అవసరం.
ఉసిరి కొవిడ్ చికిత్సలో మంచి ఔషధంలా పని చేస్తుంది. ఇందులోని పోషకాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. కరోనా లాంటి ప్రమాదకర వైరస్‌ల బారి నుంచి రక్షణ కల్పిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా, ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యం బాగా పెరిగిపోయింది. మీరు కూడా ఈ దినచర్యను క్రమం తప్పకుండా పాటిస్తే కరోనా, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దూరంగా ఉంటాయి.
మీరు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి, కానీ వాటి పరిమాణంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. శీతాకాలంలో విటమిన్ సి ఎక్కువగా లభించే నారింజ పండ్లను బాగా తీసుకోవాలి. ఇవి మార్కెట్లో సులభంగా లభిస్తాయి. రుచిలో అద్భుతంగా ఉండే ఈ పండ్లను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.