భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా..?
ప్రస్తుత కాలంలో ఉరుకుల పరుగుల జీవితంతో పాటు పరుగులు పెడుతూ రోజు అధిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే తమ భాగస్వామ్య గురించి ఆలోచించే తీరిక లేనందున మహిళలు ఈ విషయంలో తరచూ గొడవలు పడుతూ ఇద్దరు విడిపోవడానికి సిద్ధమవుతున్నారని సర్వే వెల్లడించింది. అయితే విడాకులు కావాలని పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా కోరుతున్నారు. పట్టింపులకు ఉన్న విలువ పెళ్లికి ఇవ్వడం లేదు. చిన్న విషయాలకే గొడవ పడి విడాకుల వరకు వెళ్తున్నారు.
అసలు ఎందుకు విడాకులకు ప్రాధాన్యం ఇస్తున్నారంటే విస్తు గొలిపే విషయాలు బహిర్గతం అవుతున్నాయి. దేశంలో దాదాపు 72 శాతం మహిళలు తమకు లైంగిక సంతృప్తి కలగడం లేదని చెబుతున్నారు. జీవిత భాగస్వామి తమను పట్టించుకోకుండా అక్రమ సంబంధాల వైపు చూస్తున్నారని కూడా ఎక్కువ మంది వెల్లడించడం గమనార్హం. యాంత్రిక జీవనంలో కెరీర్ ముఖ్యమని భార్యలను పట్టించుకోవడం లేదు. దీంతోనే వారిలో భర్తల మీద ప్రేమ తగ్గుతోంది. ఫలితంగా విడాకుల వరకు వెళ్తున్నారు.
అక్రమ సంబంధాలు కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఒకరిపై మరొకరికి గౌరవం ఇచ్చుకోవడ లేదు. ఒకరి ఆలోచనలకు మరొకరు గుర్తించలేకపోతున్నారు. అందుకే అభిప్రాయ భేదాలతో విడాకులకు మొగ్గుచూపుతున్నారు. ఇగో వల్ల తమలోని అహం దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే ఇలాంటి వాటికి దగ్గరవుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులతోనే అసంతృప్తి గా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి.
జీవిత భాగస్వామితో కలయిక అసంతృప్తిగా మారడంతో విడాకులు కోరుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ఇంకా వివాహేతర సంబంధాలు కూడా ఇంకో కారణంగా నిలుస్తున్నాయి. దేశంలోని 72 శాతం మంది మహిళలు భర్తల వల్లే విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నారు. లైంగిక పరమైన సమస్యల్లో 23 శాతం పురుషులు, 17 శాతం మహిళలు తమ భాగస్వాములను మోసం చేస్తున్నారని సర్వే చెబుతోంది. చాలా మంది పురుషులు నిజాలు వెల్లడించకుండా దాచేస్తూ పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత తెలియడంతోనే విడాకుల వరకు వెళ్తున్నట్లు సమాచారం.
శృంగారం విషయంలో దంపతుల మధ్య అవగాహన లేకపోవడం కూడా ఒక కారణంగానే తెలుస్తోంది. దంపతుల్లో ఎవరో ఒకరు ఇతరులతో శృంగారం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో దంపతుల మధ్య చిచ్చు రేగుతోంది. అది చివరకు విడాకులకు దారి తీస్తోంది. దేశంలో 30 శాతం వివాహాలు లైంగిక సంతృప్తి లేకపోవడంతోనే విడిపోతున్నాయనేది చేదు నిజం. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు పరస్పరం మాట్లాడుకుంటే సరిపోతుంది. దానికి విడాకుల వరకు వెళ్లడం ఎందుకనే ప్రశ్నలు సైతం వస్తున్నాయి.