ఈ సమయంలో కలిస్తే గర్భందాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఋతుస్రావం ముగిసిన ఒక రోజు తరువాత గర్భవతి కావటం అనేది సాధ్యపడదు. మామూలుగా ఋతుస్రావం 28 రోజులకు ఒక సారి ఏర్పడుతుంది. ఋతు చక్రం ప్రారంభించిన 14వ రోజు, మీ అండాశయాలు ఒక గుడ్డుని విడుదల చేస్తాయి. ఈ గుడ్డు విచ్చిన్నం చెందడం వలన రక్తస్రావం మొదలవుతుంది. తల్లిదండ్రులుగా మారడం అనేది జీవితంలో చాలా అందమైన విషయాలలో ఒకటి. అయితే, ఇది ప్రతి జంటకు ఇదేమి అంత సులభమైన విషయం కాదు.
కొంతమంది పిల్లలు కలగాలని చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేకపోతారు. అయితే ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండాలి. స్త్రీ ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉన్నప్పుడు గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి. పీడియాట్రిక్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం స్త్రీలలో ఊబకాయం ఉంటే అది సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది.
కాబట్టి మీరు అధిక బరువును కలిగి ఉన్నట్లయితే, రోజూ వ్యాయామం చేయడం, ఇతర అవసరమైన చర్యలు తీసుకుంటూ బరువు తగ్గాలి. ప్రతిరోజూ 30 నిమిషాల చురుకైన నడక, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ లేదా రన్నింగ్ చేయాలని డాక్టర్ పన్సారే సిఫార్సు చేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి..మీ సంతాన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
సాఫీగా గర్భం దాల్చేందుకు తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి. అదే సమయంలో జంక్, క్యాన్డ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. కెఫిన్ ఉత్పత్తులను కూడా తగ్గించాలి. గర్భం ధరించడానికి సరైన సమయం తెలుసుకోండి..మీ ఋతు చక్రంలో మీరు గర్భవతి కావడానికి నిర్దిష్ట సమయం అనేది ఉంటుంది. కాబట్టి గర్భం ధరించడానికి సరైన సమయం ఏంటనేది తెలిసుండాలి.
అండోత్సర్గము ప్రక్రియకు ముందు మీ యోని శ్లేష్మం స్పష్టంగా, మృదువుగా, జారేలా మారుతుంది. ఇది అండోత్సర్గము సమయంలో కలుసుకోవడానికి స్పెర్మ్ సులభంగా అండాన్ని చేరుకునేలా పైకి ఈదడానికి అనుమతిస్తుంది. గర్భవతి కావడానికి సెక్స్ చేయడానికి కూడా ఇదే ఉత్తమ సమయం అని డాక్టర్స్ చెబుతున్నారు. కాబట్టి, మీరు కలిసేటపుడు మీ అండోత్సర్గ చక్రం లేదా ఋతు క్యాలెండర్‌పై నిఘా ఉంచండి.