భర్తకి భార్య ఎడమ వైపు నిద్రించాలని ఎందుకు చెప్తారో తెలుసా..?
మనం ఏ పని చేసినా అందులో ఒక అర్థం పర మార్థం దాగి ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఒక వ్యక్తి శరీరంలో కుడి భాగానికి ఉండే శక్తి సామర్థ్యాలు ఎడమ భాగానికి ఉండవు. అందు కోసమే ఎడమ భాగానికి ఎప్పటికప్పుడు అదనపు శక్తి అవసరమవుతుంది.అందుకే ఎడమ భాగాన్ని శక్తికి సంకేతంగా కుడి భాగాన్ని శివుడికి సంకేతంగా భావిస్తారు. ఈ విధంగా కుడి ఎడమల కలయికే అర్ధనారీశ్వరుని రూపం.
ఇక ఎడమవైపు శక్తికి ప్రతిరూపం కనుక భర్తకు ఎడమవైపు భార్య ఉండాలని చెబుతారు. పురాణాల ప్రకారం మహాశివుడి ఎడమ వైపు నుంచి ఒక స్త్రీ జన్మించిందని అంటారు. అందుకే భార్యను వామంగి అని పిలుస్తారని చెబుతున్నారు. వామంగి అంటే మనిషి శరీరంలోని ఎడమవైపు అని అర్థం. అయితే పెళ్లి చేసుకునేటప్పుడు, నామకరణం, అన్న ప్రశాన సమయంలో భర్తకు కుడివైపున భార్యను కూర్చోబెడుతారు.
ఎందుకంటే ఇక్కడ పురుషుబలం ఎక్కువగా ఉంటుంది. పూజల్లోపురుసాధిక్యత ఎక్కువగా ఉండడం వల్ల పురుషులకు సంబంధించినవే మంత్రాలు ఆచరించడం వల్ల వారిని ఇలా కూర్చోబెడుతారు. భోజన సమయంలో , ఆశీర్వాదం పొందుతున్నప్పుడు భార్యను ఎక్కువగా ఎడమ వైపు కూర్చోమంటారు. ఎందుకంటే ఇవి స్త్రీకి సంబంధించిన పనులు.
ఇక్కడ పురుషుల కంటే స్త్రీలదే ఆధిక్యత ఉంటుంది. ఉదాహరణకు ఆశీర్వాదం పొందేటప్పుడు స్త్రీనే సుమంగళిగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అందువల్ల ఇలాంటి సమయాల్లో వారికే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వారిని భర్తకు ఎడమ వైపు కూర్చోబెడుతారు. అయితే నిద్రించే సమయంలోనూ భర్తకు ఎడమ వైపున భార్యఉండాలంటున్నారు.
ఇలా నిద్రించడం వల్ల వారి మధ్య ప్రేమ వృద్ధి చెందుతుంది. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సాధారణంగానే మహిళలు ఎడమ వైపు నిద్రించాలని చెబుతున్నారు. అలాగే భర్తతో ఉన్నప్పుడు కూడా భర్తకు ఎడమ వైపున నిద్రించడం వల్ల ఎలాంటి వాస్తుదోశం ఉండదని చెబుతున్నారు.