రాత్రిపూట భార్యా భర్తలు ఇలా నిద్రపోతే ఎంత మంచిదో తెలుసా..?
భార్యా భర్తలు చిన్నపాటి విషయాలకే గొడవలు పడుతుంటారు. అయితే ఒకరినొకరు అర్థం చేసుకుని మసలుకోవాలే గానీ ఎలాంటి గొడవలు రావు. భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉండవచ్చు. అయితే భార్యా భర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉండాలని అనుకుంటారు. భార్య భర్తలు పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని స్వీకరించి ఆ జీవితం బాగుండాలని.. భార్య వలన భర్తకి కానీ భర్త వలన భార్యకు కానీ కష్టాలు కలగకూడదని అనుకుంటారు భార్యాభర్తల మధ్య బంధం బాగుండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
అలానే భార్య భర్తలు ఒకరి ఇష్టాలని ఇంకొకరు గౌరవించడం, ఒకరు చెప్పిన వాటిని పాటించడం చేయాలి. ఇవన్నీ ఇలా ఉంటే భార్యాభర్తలు రాత్రి సమయంలో నిద్ర పోయేటప్పుడు కూడా పలు నియమాలు ఉన్నాయి. వాటిని ఆచరిస్తే భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. భార్యాభర్తలు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఈ విధంగా పాటించాలి.
భార్య భర్తలు నిద్రపోయేటప్పుడు మంచం గోడకి తాకకుండా నాలుగు వైపులా కూడా ఖాళీ ఉండేలా చూసుకోవాలి అప్పుడు భార్య భర్తలకి అంతా మంచి జరుగుతుంది. భార్యాభర్తలు ఒకే మంచం మీద నిద్రపోవాలి ఎన్ని గొడవలు వున్నా ఎన్ని సమస్యలు ఉన్నా వేరు వేరు మంచాల మీద భార్యాభర్తలు నిద్రపోకూడదు.
మంచానికి కుడివైపు భర్త ఎడమ వైపు భార్య పడుకోవాలి. రాత్రిపూట మీకు ఎక్కువసార్లు మెలకువ వస్తున్నట్లయితే నిద్ర వాతావరణాన్ని కచ్చితంగా మెరుగుపరుచుకోండి. రాత్రిళ్ళు నిద్రపోయేటప్పుడు ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోవడం మంచిది లేవగానే ఉదయిస్తున్న సూర్యుడుని చూస్తే అంతా మంచి జరుగుతుంది.
ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిద్రలేస్తూనే వంటింట్లోకి వెళ్లడం ఇల్లు ఊడవడం మంచిది కాదు ఇలా భార్యాభర్తలు నిద్రపోయేటప్పుడు ఈ విషయాలని పాటించారంటే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఏ కష్టం ఉండదు సంతోషంగా ఉంటారు.