సంసారం సాఫీగా సాగిపోవాలంటే భార్యాభర్తలు తప్పక పాటించాల్సిన జాగర్తలు ఇవే.
భార్యాభర్తలు ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఒకరితో మరొకరు మనసును విప్పి మాట్లాడుకోవడానికి కాస్త సమయం కేటాయించాలి. లేదంటే భోజనం చేసే సమయంలో అయినా ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. అంతేకాకుండా వారంలో ఒక్కసారి అయినా కలిసి సినిమాలకు లేదంటే కాలక్షేపం కోసమో వెళ్లడం లాంటివి చేయాలి. అయితే భార్యాభర్తల మధ్య ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. అది కోల్పో యిన నాడు జీవితం గందరగోళంగా మారుతుంది.
దంపతుల్లో నిజాయితీ ఉండాలి. ఏ పనిచేసినా ఇద్దరు అనుకుని చేయడం మంచిది. దీంతో ఆలుమగల మధ్య అనుబంధం పెరుగుతుంది. కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలి. అప్పుడే దాంపత్యం సాఫీగా సాగుతుంది. ప్రేమ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు.. కుటుంబ నిర్వహణకు డబ్బు అవసరమే. జీవితంలో మనం సంపాదించే డబ్బు మొత్తం ఖర్చు చేయకుండా మనం బవిష్యత్ కోసం కొంత డబ్బు దాచుకోవడం తప్పనిసరి.
లేకపోతే మనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు కష్టాలు తప్పవు. భవిష్యత్ కోసం పొదుపు చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. మన అవసరానికి ఎవరు డబ్బు ఇవ్వకపోతే సమస్యను పరిష్కరించుకోవడం కష్టం అవుతుంది. సహనం..భార్యాభర్తలకు సహనం ముఖ్యం. ఏదైనా గొడవ వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకుంటే ఎవరి సహకారం అవసరం ఉండదు.
ఇంట్లో గొడవలు జరిగితే అందరు వస్తే బాగుండదు. జీవిత భాగస్వామిలోని లోపాలను అర్థం చేసుకుంటే సమస్యలే రావు. కాపురంలో కలతలు రాకుండా ఉంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. తప్పులను క్షమిస్తే ఎలాంటి గొడవలు ఉండవు. సోమరితనం..దంపతుల్లో సోమరితనం ఉండకూడదు. బద్ధకం ఎక్కువైతే పనులు వాయిదా పడతాయి. దీంతో ఇద్దరి మధ్య గొడవలకు ఆస్కారం ఉంటుంది.
జీవితం ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాలంటే డబ్బు అవసరం అవుతుంది. అది సంపాదించాలంటే సోమరితనం ఉంటే వీలు కాదు. అందుకే బద్ధకం వదిలేసి మంచి చురుకుగా ముందుకు సాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా చూసుకోవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య చాణక్యుడు సూచిస్తున్నాడు.