దంపతుల మధ్య చిచ్చు పెడుతున్న స్మార్ట్ ఫోన్. వెలుగులోకి సంచలన విషయాలు.
మన అరచేతిలో ఇమిడిపోయిన స్మార్ట్ ఫోన్.. ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చి పెట్టింది. ఎక్కడ ఏ మూల, ఏది జరిగినా ఇట్టే తెలిసేలా చేస్తోంది. మనిషికీ మనిషికీ మధ్య దూరం చెరిపేసింది. అందరినీ తనతో కనెక్ట్ చేసేసింది. మారుతున్న కాలానుగుణంగా, అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికతతోనే ఇది సాధ్యమైంది. అయితే స్విఛ్ ఆఫ్ పేరిట సర్వే.. సైబర్ మీడియా రీసెర్చ్ అనే సంస్థ ‘స్విఛ్ ఆఫ్’ పేరిట ఈ సర్వే చేపట్టింది. దేశంలోని వివిధ నగరాల్లో దాదాపు 2,000 మంది దంపతుల అభిప్రాయాలను తీసుకుంది.
ఈ సర్వేకు వివో స్మార్ట్‌ఫోన్ కంపెనీ సహకారం అందించింది. స్మార్ట్‌ఫోన్ వినియోగం కారణంగా దాదాపు 89 శాతం మంది తమకు ఇష్టమైన వారితో మాట్లాడటానికి ఎక్కువ సమయం కేటాయించ లేకపోతున్నట్లు సర్వేలో తేలింది. రోజుకు సగటున 4.7 గంటల వినియోగం.. స్మార్ట్‌ఫోన్ అతిగా ఉపయోగించడం వల్ల తమ రిలేషన్స్ దెబ్బతింటున్నాయని 88 శాతం మంది చెప్పారు. పురుషులు, స్ట్రీల మధ్య స్మార్ట్‌ఫోన్ వినియోగంలో గణనీయమైన తేడాలు లేవు. సగటున రోజుకు 4.7 గంటలపాటు స్మార్ట్‌ఫోన్ అరచేతిలో ఉంటోంది.
దీంతో దంపతుల మధ్య అర్ధవంతమైన సంభాషణలు ఉండటం లేదని, కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం సవాలుగా మారిందని సర్వే పేర్కొంది. ఫ్రీ టైమ్‌లోనూ చేతిలో ఫోన్.. 90 శాతం మంది వారికి ఉన్న ఫ్రీ టైమ్‌లో తమ జీవిత భాగస్వామితో గడపటానికి ఇష్టపడుతున్నారు. అయితే వీరిలో 88 శాతం మంది ఈ సమయంలో కూడా స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు సర్వే పేర్కొంది. ఈ సర్వే బయటపెట్టిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు నిద్రలేచిన 15 నిమిషాలలోపే వారి స్మార్ట్‌ఫోన్‌ను చేతుల్లోకి తీసుకుంటున్నారు.
సర్వేలో పాల్గొన్న వారిలో 28 శాతం మంది నిద్ర లేచిన 5, 10 నిమిషాల మధ్య తమ ఫోన్‌ను వినియోగిస్తున్నట్లు అంగీకరించారు. మేనేజ్మెంట్ అవసరం.. ఈ సర్వే వివరాలపై వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ హెడ్ యోగేంద్ర శ్రీరాముల మాట్లాడుతూ.. టెక్నాలజీ ప్రాముఖ్యత పెరిగిన ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం తప్పనిసరి అయిందన్నారు. అయితే అతిగా ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగానికి టైమ్ మేనేజ్మెంట్ ఉండాలని సూచించారు. స్మార్ట్‌ఫోన్ అతిగా వినియోగించడానికి స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సర్వీస్ చౌకగా అందుబాటులోకి రావడం కూడా ఓ కారణమని సర్వే పేర్కొంది.