Health

సంతానం కోసం ఎదురుచూస్తున్నారా..? పురుషులు తినాల్సిన ఫుడ్ ఇదే.

మాతృత్వం అనేది మహిళలకు ఎంత ముఖ్యమో.. తండ్రి అయ్యానని చెప్పుకోవడం పురుషులకూ అంతే ముఖ్యం. అయితే నేటి రోజుల్లో అనేక కారణాలు.. ఈ భావనకు యువజంటలను దూరం చేస్తున్నాయి. దీనికి ప్రత్యేక కారణాలు మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆలస్యంగా వివాహాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. అయితే వైవాహిక బంధంలో ఆరోగ్యకరమైన సంతానం కోసం.. మహిళలు మాత్రమే కాదు.. పురుషులు కూడా ఆరోగ్యంపై దృష్టిసారించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అందుకే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మగవారిలో వీర్య కణాలు పెరిగేందుకు ఆహార పదార్థాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గుడ్డు.. పురుషులలో ఎక్కువ స్పెర్మ్ ఉత్పత్తి చేయడానికి గుడ్లు సహాయపడతాయి. అలాగే గుడ్డును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది. టమాటా.. టమాటాల్లో విటమిన్ సి, లైకోపీన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్పెర్మ్ కౌంట్‌ను మెరుగుపరుస్తాయి.

అరటిపండు.. దీనిలో మెగ్నీషియం, విటమిన్ బి1, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే స్పెర్మ్ ఉత్పత్తి పెరుగుతుంది. అరటిపండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు సహాయపడుతుంది. దానిమ్మ.. పండులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రవాహంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి.

దీంతోపాటు స్పెర్మ్‌కు హాని కలగకుండా కాపాడతాయి. వెల్లుల్లి.. వెల్లుల్లిలోని సెలీనియం అనే ఎంజైమ్ స్పెర్మ్ మొబిలిటీని పెంచడానికి సహాయపడుతుంది. పాలకూర.. పాలకూరలోని పోలీ ఎలిమెంట్స్ స్పెర్మ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బెర్రీస్.. స్ట్రాబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, క్రాన్‌బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ బెర్రీలలోని శోథ నిరోధక లక్షణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి అవసరమైన రక్షణను అందించి.. ఆరోగ్యకరమైన స్పెర్మ్‌ కౌంట్ పెంచేందుకు సహాయపడతాయి. క్యారెట్.. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ హానిని నివారించి.. మీ స్పెర్మ్‌ కౌంట్‌ను పెంచేందుకు యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker