భార్య భర్తల మధ్య ఎంత వయసు తేడా ఉండాలో తెలుసా..?
పెళ్ళి అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం. అయితే అమ్మాయిలు తమకంటే ఎక్కువ వయసు ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు . ప్రేమ వివాహం అయితే సాధారణంగా తమ క్లాసుమేట్ లేదా ఒకటి రెండు సంవత్సరాల సీనియర్. తమ తోటి ఫ్రండ్స్ లవ్ మ్యారేజ్ చేసుకొన్నారు.
అమ్మాయికన్నా, అబ్బాయి మహా అయితే, ఒకటిరెండెళ్లు పెద్ద . తమది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఇలాగే ఉండాలని, అమ్మాయిలు అనుకొంటున్నారు . తమ కంటే వయసులో పెద్ద అయితే తమని చిన్న పిల్ల ను చూసినట్టు చూస్తారని , అంటే తమ పై డామినేట్ చేస్తారని అమ్మాయిలు అనుకొంటున్నారు . ఇందులో పాయింట్ ఉంది. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే అమ్మాయికి అబ్బాయికి సగటు వయసు నేడు ముప్పై గా మారింది . ముప్పై ఏళ్లున్న అమ్మాయి తనకంటే వయసులో బాగా పెద్ద అయిన అబ్బాయి ని అంకుల్ అన్నట్టు చూస్తోంది . ఆరంజ్డ్ మ్యారేజెస్ లో నేడు అమ్మాయిల మాటే నడుస్తోంది . డిమాండ్ సప్లై ఇందుకు కారణం { లింగ నిష్పత్తి } . ఒకప్పటి వివాహాలు : ఒకప్పటి అంటే నేను వందేళ్లు వెనక్కు వెళ్లడం లేదు . ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువ.
అంతే కాకుండా బహుభార్యత్వం ఎక్కువ . ఒక తరం లేదా రెండు తరాలు ముందుకు వెళితే { అంటే నేడు యాభై నుంచి డెబ్భై ఎనబై ఉన్నవారు} భార్య కి భర్తకి పదేళ్లు తేడా సహజంగా ఉండేది. స్త్రీలలో సాధారణంగా లైంగిక వాంఛ 45 వయసు ప్రాంతం లో సన్నగిల్లుతుంది. అదే ఆరోగ్య కరమయిన పురుషుడికి అరవై దాటాక కూడా అది కొనసాగుతుంది. ఒకే వయసు వారైతే నలబై యాభై లో పడ్డ భర్త లైంగిక వాంఛను, భార్య తీర్చే అవకాశం సన్నగిలుతుంది. అదే పదేళ్లు తేడా ఉంటే ఈ సమస్య రాదు. జీవశాస్త్ర పరంగా ఈ వయసు తేడా వాంఛనీయం. భర్తకు ముప్పై, భార్య కు ఇరవై ఉంటే వారికి పొసుగుతుందా.. స్రీలు సాధారణంగా తమ వయసులంటే ఎక్కువ మానసిక పరిణతిని కనబరుస్తారు. ఇంతే కాకుండా సాంప్రదాయిక వివాహాల్లో పురుషాధిక్యత ఉండేది. మనది పితృ వంశీయ , పితృ స్వామ్య , పితృ స్థానిక ఆచారం.
ఇది అందరికీ తెలిసిందే. ఆధునిక భార్య తన భర్తను పేరుతొ పిలిస్తుంది. అదే వెనుకటి రోజుల్లో భర్త పేరు చెప్పాల్సి వచ్చినా, భార్య నానా హైరానా పడిపోయేది. “ఛీ పాడు.. నేను చెప్పను . ఆలా భర్త పేరు చెప్పకూడదు . అది అమర్యాద “అని చెప్పేది. సమాజం మారుతోంది . లింగ సమానత్వం మంచి పరిణామం . అదే సమయం లో ఇతర జైవిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అమ్మాయి అబ్బాయి ఇష్టపడినప్పుడు { నిన్న మెసెంజర్ లో ఇదే ప్రశ్న అడిగారు } పదేళ్లు వయసు తేడా తప్పు కాదు . ఒక కోణంలో అభిలషణీయం కూడా. చిన్నపిల్లల పై లైంగిక అత్యాచారాలు చేసే వారు రెండు రకాలు.
1 . జైవికంగా పెడోఫిల్లీ వాంఛ కలిగిన వారు . రెండోది అవకాశవాద పెడోఫిలీలు . ఈ రెండో కేటగిరీ లో నలబై ఏళ్ళ- యాభై అరవై ఏళ్ళ వల్లే ఎక్కువ . లైంగిక వాంఛ తీరక, “చిన్న పిల్లలైతే రిస్క్ తక్కువ .. అడ్డు చెప్పరు .. బయటపడదు” అని ఈ వెధవలు అనుకొంటారు . ఇటీవలి కాలం లో వీరి సంఖ్య భారీగా పెరుగుతోంది . దానికి ఒక కారణం పైన పేరా లో నేను చెప్పింది . మానవ సమాజానికి సంబంధించి సాధారణీకరణ అంటే నూటికి నూరు శాతం అని కాదు . సింహ భాగం మాత్రమే . పైన చెప్పిన నలబై యాభై లో కి అడుగుపెట్టి సెక్సువల్లి ఫ్రాస్ట్రేటెడ్ వారు ఎంత నిజమో ముప్పై లో ఉండి భార్య కు తీవ్ర అసంతృప్తిని మిగిల్చే లాప్ టాప్ వీరులు కూడా అంతే నిజం.