Health

దాంపత్య జీవితంలో భర్తతో పొరపాటన కూడా భార్య ఈ విషయాలు చెప్పకూడదు.

దాంపత్య జీవితం సుఖంగా ఉండాలి అనుకునే వారు కొన్ని వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి. భార్యాభర్తల దాంపత్య జీవితం సుఖంగా ఉండాలంటే వారు బెడ్రూంలో కొన్ని వస్తువులను నిరోధించాలి. బెడ్రూంలో దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోవడం మంచిది కాదు. అలా పెట్టుకోవడం వల్ల భార్య భర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఆనంద గ్రహం అయిన శుక్రుడు బెడ్ రూమ్ ని పాలిస్తాడు. అయితే భార్యా భర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు ఉండకూడదంటారు.

ఎలాంటి రహస్యాలు దాచకూడదంటారు. కానీ మొత్తం రహస్యాలు బయటపెడితే ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు వాటిని కెలికే ప్రమాదం ఉంటుంది. నువ్వు అలాంటి దానివని దెప్పి పొడుస్తూ ఉంటారు. అలాగే భార్య కూడా నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? కాలేజీ రోజుల్లో నువ్వు ఎంత మందితో తిరగలేదు అని సెటైర్లు వేస్తుంది. దీంతో సాధ్యమైనంత వరకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రహస్యాలు చెప్పకపోవడమే బెటర్.

గొడవలు.. ఆలుమగల గొడవలు పొద్దున్నే వచ్చి సాయంత్రం పోతాయి. కానీ కొందరు మాత్రం వాటిని తీవ్రంగా పరిగణిస్తారు. దీంతో భాగస్వామికి కంటి మీద కునుకు లేకుండా చేస్తారు. నీ క్యారెక్టరే అంత అని నీచంగా మాట్లాడుతుంటారు. ఇవన్ని బాధల కంటే ముందే చెప్పకపోవడమే సురక్షిత మార్గం. ఎవరో చెబితే ఏదో దాటేయొచ్చు. కానీ మనమే చెబితే దొరికిపోతాం.

రహస్యాలు.. ఒకవేళ అలాంటి రహస్యాలు చెప్పినా దాని మీద అనేక సందేహాలు వస్తుంటాయి. అతడి క్యారెక్టర్ మంచిది కాదేమో. ఎంత మందితో తిరిగాడో అని అనుకుంటుంది. తన భార్య ఎందరిని ప్రేమించిందో అని భర్త ఆలోచించడం కూడా పరిపాటే. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు చెప్పి అభాసుపాలయ్యే బదులు వాటిని దాచిపెట్టి మంచిగా సంసారం చేసుకోవడమే ఉత్తమమైన మార్గం.

పొరపాటున..భార్యాభర్తలు దాపరికం లేకుండా అన్ని విషయాలు చెప్పుకున్నా పొరపాటున కూడా కాలేజీ రోజుల్లో ఉన్న ఎఫైర్ల గురించి చెప్పకూడదు. అలా చెబితే మన జుట్టు వారి చేతిలో ఇరుక్కున్నట్లే. సమయం వచ్చినప్పుడల్లా పుండు మీద కారం చల్లినట్లే. ఎవరైనా ఒక వ్యక్తితో ప్రేమలో పడిన విషయం భర్తతో పంచుకోకూడదు. అవతల వ్యక్తి ద్వారా తెలిసినా ఫర్వాలేదు. కానీ మనమే చెప్పుకుంటే ముప్పు తెచ్చుకున్నట్లే అవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker