Health

దేశంలో షుగర్ వ్యాధితో ఎంత మంది బాధపడుతున్నారో తెలుసా..?

మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అయితే మధుమేహం వంటి వ్యాధులు ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరుగుతున్నాయి. ICMR నిర్వహించిన కొత్త అధ్యయనం ప్రకారం, మన దేశంలో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య 10 కోట్లు దాటింది అంటే దేశ జనాభాలో 11.4% మంది షుగర్ వ్యాధితో పోరాడుతున్నారు. మధుమేహం అనేది దీర్ఘకాలికంగా ఉండే సమస్య.

దీనికి చికిత్స లేదు, కాబట్టి ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రించుకోవడమే మార్గం. ఇందుకోసం ఆకుపచ్చ కూరగాయలు, కొన్ని రకాల పండ్లు, ప్రొటీన్లు వంటి కార్బోహైడ్రేట్లు లేని ఆహారాలు తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన మొట్టమొదటి చర్య వారి ఆహారంలో మార్పులు. వారి బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గించే ఆహారాన్ని తినాలి, తక్కువ GI ఆహారాలు తీసుకోవాలి. పుష్కలంగా ఆకుపచ్చని ఆకు కూరలు, కూరగాయలు తినాలి, క్వినోవా, తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి.

అదే సమయంలో బియ్యం, గోధుమలు, మైదా వంటి కార్బ్‌లను తగ్గించండి. చక్కెర, స్వీట్స్ వంటివి పూర్తిగా దూరం పెట్టాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. ప్రొటీన్ తినండి..ప్రోటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, అంటే రక్తప్రవాహంలో గ్లూకోజ్ శోషణ కూడా నెమ్మదిగా ఉంటుంది. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే మీరు రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి ప్రొటీన్ తినండి. శనగపప్పు, పచ్చి శనగలు, నల్ల శనగలు, రాజ్మా, పుట్టగొడుగులు, ఇతర పప్పులు, కాయధాన్యాలు తీసుకోవాలి. మాంసాహారులు చికెన్, చేపలు తినవచ్చు, మటన్ నివారించాలి.

ఆరోగ్యకరమైన కొవ్వులు..మధుమేహం ఉన్నవారు ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవచ్చు, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. కూరగాయల నూనె, నెయ్యి, గింజలు వంటివి ఆరోగ్యకరమైన కొవ్వులకు మూలాలు. అదే సమయంలో సంతృప్త కొవ్వులను తగ్గించండి, ట్రాన్స్ ఫ్యాట్‌లను నివారించండి. వ్యాయామం తప్పనిసరి.. నడక, జాగింగ్, సైక్లింగ్, ఇతర శారీరక కార్యకలాపాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే మీ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటాయి. రోజుకు కనీసం 7000 అడుగులు నడవాలి. 10,000 అడుగులు నడిస్తే మరీ మంచిది. ఒత్తిడి నివారించండి..పెరిగిన ఒత్తిడి స్థాయిలు మీ రక్తంలో చక్కెర స్థాయిలను దెబ్బతీస్తాయి.

మంచి ఆహారం తినడం, వ్యాయామ చేయడంతో పాటు, ఒత్తిడిని తగ్గించుకునే చర్యలు తీసుకోవాలి. యోగా, ధ్యానం వంటివి శారీరకంగా మాత్రమే కాకుండా మానసిక సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయి. బరువు తగ్గించండి.. అధిక బరువు లేదా ఊబకాయం ఉంటే, ఆహారం, వ్యాయామం, స్వీయ-క్రమశిక్షణ చర్యల ద్వారా బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. రెగ్యులర్ చెక్-అప్‌లు చేయించుకోండి. ఇలా చేయడం వలన మీరు ప్రీ-డయాబెటిస్ స్థాయిలో ఉంటే పరిస్థితిని తిప్పికొట్టవచ్చు, డయాబెటిస్‌ రాకుండా నిరోధించవచ్చు. ఒకవేళ ఎక్కువైతే మరింత మెరుగ్గా జీవనశైలి మార్పులు చేసుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker