Health

రోజూ వీటిని తింటే చాలు మీ స్పెర్మ్‌ కౌంట్‌ రెట్టింపు అవుతుంది.

సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిలోని ఒక మిల్లీలీటర్ వీర్యంలో సుమారు 40 నుంచి 300 మిలియన్ల స్పెర్మ్ ఉంటుంది. ఈ సంఖ్య 10 మిలియన్ నుంచి 20 మిలియన్ మధ్య ఉంటే లో-స్పెర్మ్ కౌంట్ అంటారు. మహిళలు గర్భం దాల్చాలంటే పురుషుడి నుంచి విడుదలయ్యే ఈ స్పెర్మ్ కౌంట్ సుమారు 30 మిలియన్లకు పైగా ఉండాలని వైద్యులు తెలుపుతున్నారు. అయితే పేలవమైన జీవన శైలి, అలవాట్లు, నిద్రలేమి, కాలుష్యం వంటివన్నీ స్పెర్మ్ కౌంట్ తగ్గేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

దీనివల్ల గర్భందాల్చడం కష్టమవుతుంది. అందుకే స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకుంటే.. స్పెర్మ్ ఆరోగ్యంగా పెరుగుతుంది. బెర్రీల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లను తీసుకోవడం వల్ల వీర్యకరణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ నాణ్యతను మెరుగుపర్చడానికి కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ యాంటీ యాక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపుతాయి. ఇవి మన శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి.

పుచ్చకాయ, టమాటాలు, చిలగడదుంపలు, గుమ్మడిగింజలు, క్యారెట్లు, చేపలు, వాల్ నట్స్, బ్లూ బెర్రీలు, దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ కౌంట్ ను పెంచడంలో సహాయపడతాయి. స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లలో లిపోయిక్ ఆమ్లం ఒకటి. ఇది బచ్చలికూరలో పుష్కలంగా ఉంటుంది. బంగాళాదుంపల్లో కూడా ఉంటుంది. వీటిని తీసుకుంటే వీర్యకణాల సంఖ్య బాగా పెరుగుతుంది. సెలీనియం, విటమిన్ ఇలు ఆర్ బీసీకి ఆక్సీకరణ నష్టాన్ని నిరోధిస్తాయి. అలాగే ఐవిఎఫ్ చికిత్సకు ముందు స్పెర్మ్ మొబిలిటీని పెంచడానికి కూడా సహాయపడతాయి.

ఈ సెలీనియం స్థాయిలను పెంచడానికి కాలెయ మాంసం, గుడ్లు, పౌల్ట్రీని తినండి. పొద్దు తిరుగుడు నూనెలో విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. స్పెర్మ్ కౌంట్ పెరగాలన్నా.. అది హెల్తీగా ఉండాలన్నా.. జింక్ చాలా అవసరం. ఈ ఖనిజం గుల్లల్లో పుష్కలంగా ఉంటుంది. అలాగే రెడ్ మీట్, పౌల్ట్రీలో కూడా బాగానే ఉంటుంది. పీతలు, బీన్స్, ఎండ్రికాయలు, గింజలు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తుల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. రోజూ పుష్కలంగా నీటిని తాగుతూ ఉండాలి. ఎందుకంటే నీరే మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి సహాయపడతాయి.

అలాగే వీర్యం కూడా నీటి ఆధారితమైందే. ద్రవాలను తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్, వీర్యం నాణ్యత మెరుగుపడుతుంది. అందుకే మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ఎప్పుడూ మీతో ఒక వాటర్ బాటిల్ ను ఉంచుకోండి. నిద్రతో కూడా స్పెర్మ్ కౌంట్ ను పెంచుకోవచ్చు. తక్కువగా నిద్రపోయే వారిలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. వీర్యకణాల సంఖ్య పెరగాలంటే ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోండి. ఒకే సమయానికి నిద్ర లేవండి. ఇది మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. గాఢనిద్ర మిమ్మల్ని శక్తివంతంగా, హుషారుగా చేస్తుంది. అలాగే మీ స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker