News

అర్ధరాత్రి ఇంట్లోకి సడన్‌గా భర్త రావడంతో.. ప్రియుడిని కూలర్‌లో దాచిన ప్రియురాలు, వీడియో వైరల్.

భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్త చేసే పనులు.. కొన్నిసార్లు వారి కాపురంలోనే చిచ్చు పెడుతుంటాయి. ఈ విషయం తెలిసినా చాలా మంది దంపతులు తప్పు మీద తప్పులు చేస్తుంటారు. ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయంలో ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. ప్రియురాలితో ఉండగా భార్యకు దొరికిపోయిన భర్తలు..

ప్రియుడితో ఉంటూ భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతున్న భార్యలను తరచూ చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిస్తే గొడవ అవుతుందని భావించి కూలర్‌లో దాక్కున్నాడు.

అలికిడి అనిపించడంతో కుటుంబ సభ్యులు చూడగా.. కూలర్‌లో నక్కి కూర్చున్నాడు. కూలర్‌లో దాగొన్న వ్యక్తిని ప్రేయసి ఇంటి సభ్యులు గుర్తించి బయటకు లాగారు. ఈ ఘటన రాజస్తాన్‌లో జరిగింది. ఈ విషయంపై అబ్బాయి, అమ్మాయి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల మోత మోగించారు.

కూలర్‌లో ఎలా పట్టాడంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. నింజా టెక్నిక్ అంటూ మరొకరు, ఇంకా నయం వాషింగ్ మెషిన్ లో వేయలేదు.. వేసుంటే బాగా ఉతికి ఆరేసేవారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker