గర్భనిరోధకాలు వాడె ముందు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.
అత్యవసర గర్భనిరోధకాన్ని గర్భాశయ గర్భనిరోధకం అని కూడా అంటారు. సాధారణంగా, అసురక్షిత సె*క్స్ చేసిన తర్వాత మహిళలు తీసుకునే ఇతర పద్ధతులు లేదా అవి విజయవంతం కానప్పుడు ఇతర గర్భనిరోధక చర్యలు ఉన్నాయి. అయితే నోటి ద్వారా తీసుకునే ట్యాబ్లెట్ల నుంచి కాపర్ టి వరకు అనేక రకాల గర్భనిరోధక పద్దతులు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలికంగా వీటిని వాడడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
వీటిని మరీ అధిక కాలం పాటూ వాడడం వల్ల వచ్చే అనారోగ్యాల నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి మహిళకూ ఉంది.వారే తమ ఆరోగ్యాన్ని తాము కాపాడుకోవాలి. రక్తం గడ్డకట్టడం..బర్త్ కంట్రోల్ పిల్స్‌లో కొన్ని సమ్మేళనాలు ఉంటాయి, వీటిని ఎక్కువ కాలం ఉపయోగించినప్పుడు రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడే వారిలో ఇటువంటి ప్రమాదాలు ఎక్కువ.
కాబట్టి ఈ సమస్యలు ఉన్నవాళ్లు బర్త్ కంట్రోల్ పిల్స్ తక్కువగా వాడాలి. రోజూ వేసుకోవడం అందులోనూ నెలల తరబడి వాడడం మంచిది కాదు. గుండెపోటు.. బర్త్ కంట్రోల్స్ పిల్స్ అధికంగా వాడడం వల్ల రక్తం గడ్డకట్టవచ్చని ముందే చెప్పుకున్నాం. దీనివల్ల గుండె లేదా మెదడులో కూడా ఇలా జరుగవచ్చు. దీనివల్ల గుండె పోటు, స్ట్రోక్ వంటివి రావచ్చు. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టినా గుండె పోటు రావచ్చు. అందుకే గర్భనిరోధక మాత్రలు వాడే బదులు కాలర్ టి (IUD) వంటి గర్భనిరోధక పద్ధతులకు మారడం మంచి ఎంపిక.
మైగ్రేన్.. మీరు తరచుగా తలనొప్పితో బాధపడుతుంటే గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. ఇవి పరిస్థితిని మరింతగా దిగజారుస్తాయి. ఈ మాత్రలలో ఈస్ట్రోజెన్ ఉంటుంది. అది తీవ్రమైన మైగ్రేన్ నొప్పికి కారణం అవుతుంది. అలాగే రక్తం కూడా గడ్డకట్టవచ్చు. క్యాన్సర్.. గర్భనిరోధక మాత్రలు క్యాన్సర్‌కు కారణం అవుతాయి. గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అందుకే గర్భనిరోధక మాత్రలు వాడకుండా ఉండడం ఉత్తమం. దానికి బదులు వేరే పద్ధతులు వెతుక్కోవాలి.