రాగి ఉంగరం ధరిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. కొన్ని రోజులకే మీ శరీరంలో కనిపించే మార్పులు.
రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన చింతలన్నీ తొలగిపోతాయి. సానుకూల అనుభూతిని కలిగిస్తుంది రాగి ఉంగరం. అలానే కోపం కూడా కంట్రోల్ లో ఉంటుంది. కోపం ఎక్కువగా వచ్చే వాళ్ళు రాగి ఉంగరాన్ని ధరిస్తే కోపం కంట్రోల్ అవుతుందని వేద శాస్త్రంలో చెప్పబడింది. సూర్యుడు, కుజుడు జాతకంలో అనుకూల స్థితిలో ఉండాలంటే రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం మంచిది. దాని వలన చెడు ప్రభావం తగ్గుతుంది. వ్యక్తిత్వ వికాసానికి కూడా రాగి ఉంగరాన్ని ధరించడం ఎంతో మంచిది. అయితే మన దేశంలో రాగి ఉంగరాన్ని స్వచ్ఛమైన, పవిత్రమైన ఉంగరంగా భావిస్తారు.
ఈ ఉంగరాన్ని సూర్యుడు, అంగారకుడిపై చెందిన లోహంగా భావిస్తారు. సూర్యుడు వల్ల కలిగే వ్యాధులను ఈ రాగి ఉంగరం నయం చేస్తుంది. కేవలం రాగి ఉంగరమే కాదు రాగి పాత్రలను ఉపయోగించిన ఎన్నో ఆరోగ్య ప్రయాజనాలు ఉన్నాయ్. రాగి ఉంగరం ధరించడం వల్ల శరీరలో వేడి తగ్గుతుంది. అంతేకాదు… రాగి ఉంగరం రక్తపోటు, గుండెపోటు రాకుండా కాపాడుతుంది. ఇక తరచూ తలనొప్పితో భావించే వారికి రాగి ఉంగరం వల్ల ఉపశమనం కలుగుతుంది.
రాగి ఉంగరం వల్ల సూర్యుని నుంచి వచ్చే నెగటివ్ శక్తిని తరిమి పాజిటివ్ శక్తిని అందిస్తుంది. ఇక రాగి ఉంగరం వల్ల ఒత్తిడి తగ్గి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈ రాగి ఉంగరంతో వ్యాధినిరోధక శక్తి బాగా పెరుగుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ రాగి ఉంగరం ఎముకలకు కావాల్సినంత బలాన్ని ఇస్తుంది. వాపులు వంటి వాటిని కూడా రాగి ఉంగరం తగ్గించేస్తుంది.
అంతేకాదు చర్మ సౌందర్యానికి కూడా రాగి ఉంగరం ఎంతో మంచిది. శరీరంలో ఉండే నొప్పులను పూర్తిగా తగ్గించి ఉపశమనాన్ని ఇస్తుంది. జ్యోతిష, ఆయుర్వేద శాస్త్రాల్లోను ఈ రాగి ఉంగరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది ధరించడం వల్ల పొట్టకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయ్. ఈ ఉంగరం ధరించడం వల్ల రక్తం కూడా సరిగ్గా ప్రవహిస్తుంది. అలా కావడం వల్ల రక్తం శుభ్రంగా మారుతుంది.
రాగి పాత్రలో ఉంచిన నీరు తీసుకుంటే మరింత ప్రయోజనం. నిజానికి రాగి పాత్రలను ఆరోగ్యానికి మాత్రమే కాకుండా వాస్తు దోషాలు కూడా దూరం అవుతాయ్. ఇంటి గుమ్మం ముందు రాగి నాణెం వేలాడదీయడం వల్ల వాస్తు దోషం తొలిగిపోతుంది. చూశారుగా రాగి ఉంగరం వల్ల, రాగి పాత్రల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం రాగి ఉంగరాన్ని ధరించి ఆరోగ్య సమస్యలకు శాశ్వతంగా స్వస్తి చెప్పండి.