రోజూ కాఫీ తాగే అలవాటు ఉందా..? ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు.
మూడు నాలుగు సార్లు కంటే కూడా ఎక్కువగా కాఫీని తాగే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది మంచి అలవాటు కాదు. కాఫీని రోజుకి ఒక సారి మాత్రమే తీసుకోవాలి ఒకసారి కంటే ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. అయితే మనలో చాలామందికి రోజూ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది టీను అమితంగా ఇష్టపడితే చాలామంది కాఫీ తాగడానికి ఆసక్తి చూపిస్తారు.
అయితే కాఫీ విషయంలో ప్రజల్లో అనేక అపోహలున్నాయి. రోజూ కాఫీ తాగితే ఆరోగ్యానికి ప్రమాదకరమని, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని పలువురు విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఆ వార్తలు నిజమేనా..? అంటే మాత్రం ముమ్మాటికీ కాదనే చెప్పాలి. చాలామంది జీవితంలో కాఫీ ఒక భాగమైపోయింది. అయితే మితంగా తాగితే కాఫీ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అమితంగా తాగితే నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
అతిగా తాగితే కాఫీ చేసే చేటు అంతాఇంతా కాదు. కాఫీ తాగితే శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నరాల సంబంధిత సమస్యలతో బాధ పడే వారు కాఫీ తాగితే ఆ ముప్పు చాలావరకు తగ్గుతుంది. యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండే కాఫీ అనేక రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది. పలు పరిశోధనల్లో కాఫీ ఎక్కువగా తాగే వారు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని తేలింది.
పనిపై ఏకాగ్రతను కలిగించే డోపామైన్ అనే న్యూరో కెమికల్ కాఫీలో ఉంటుంది. ఈ కెమికల్ శరీరంలోని నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కాఫీ తాగే వారు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా తగ్గుతుందని తెలుస్తోంది. శరీరానికి శక్తిని అందించడంతో పాటు మెదడును ఫ్రెష్ గా ఉంచడంలో కాఫీ సహాయపడుతుంది. అయితే కాఫీ మితంగా తాగితే మాత్రమే ఈ ప్రయోజనాలు చేకూరుతాయి.
ఇష్టానుసారం కాఫీ తాగితే మాత్రం సమస్యలను కొని తెచ్చుకున్నట్టే. కాఫీ తాగితే బరువు తగ్గుతారని, శరీరాన్ని కాఫీ డీహైడ్రేట్ చేస్తుందని.. గర్భిణీ స్త్రీలు కాఫీ తాగకూడదని రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించి కాఫీ తీసుకోవడం ఉత్తమం.