Health

సెలబ్రేట్స్ ఎక్కువగా కొబ్బరి నీరు ఎందుకు తాగుతారో తెలుసా..? ఆ రహస్యం ఇదే.

కొబ్బరినీటిని తాగితే. మెగ్నిషియం క్యాల్షియం పొటాషియం సోడియం వంటి అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది. డయేరియాతో ఇబ్బంది పడే పిల్లలకు డీహైడ్రేషన్ రాకుండా కాపాడే పానీయం కొబ్బరి నీరు. అయితే కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలామంచిది. సాధారణంగా మార్నింగ్ వాక్‌కి వెళ్లేటప్పుడు కొందరు కొబ్బరి నీళ్లు తాగడాన్ని తరచుగా చూసి ఉంటారు.

చాలా మంది నటులు లేదా ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌ల ఆహారంలో కొబ్బరి నీరు తప్పనిసరిగా ఉంటుంది. కొబ్బరి నీరు చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు ముఖ్యంగా కొబ్బరినీళ్లు తాగడానికి ఇష్టపడతారు. కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు, చక్కెర, పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి.

కొబ్బరు నీరు ప్రయోజనాలు..బరువు తగ్గుతారు.. బరువు తగ్గడానికి కొబ్బరి నీళ్లు తాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇందులో ఉండే బయోయాక్టివ్ ఎంజైమ్‌లు జీవక్రియను పెంచి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల క్యాలరీలు వేగంగా కరిగిపోతాయి. మీరు ఫిట్ బాడీని పొందాలంటే ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగాలి. రక్తపోటును నియంత్రిస్తుంది.. కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

దీన్ని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటు రోగులకు కొబ్బరి నీళ్లు తాగడం చాలా మేలు చేస్తుంది. తక్కువ కొలెస్ట్రాల్.. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొబ్బరి నీరు శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. దీన్ని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పోతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. పిత్తాశయ రాళ్లను తొలగిస్తాయి.. కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా చేస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడానికి పని చేస్తుంది.

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఇది కిడ్నీ స్టోన్ ప్రమాదాన్ని తొలగిస్తుంది. చర్మానికి ప్రయోజనకరమైనవి.. కొబ్బరి నీళ్లలో ఉండే గుణాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. మొటిమల సమస్యను తొలగించడానికి కొబ్బరి నీరు పనిచేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తుంది. అందుకే ఇన్ని పోషకాలు, ఖనిజాలు ఉన్న కొబ్బరి నీటిని తరచూ హీరోయిన్లు, హీరోలు తీసుకుంటారని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల తక్షణమే శక్తి వస్తుందని.. ఎనర్జిటిక్ గా ఉంటారని పేర్కొంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker